Kanuma Muggulu 2024: కనుమ పండుగ రోజు తప్పకుండా వేయాల్సిన ముగ్గులు.. ఇలా సులభంగా వేయండి..

Kanuma Muggulu 2024: పండగ రోజు మహిళలంతా రంగురంగుల ముగ్గులను వేస్తారు. అంతేకాకుండా కొంతమంది పూర్వీకుల నుంచి వస్తున్న రథం, ముత్యాల ముగ్గులు కూడా వేస్తారు. అయితే మీరు కూడా మంచి ముగ్గురు వేయాలనుకుంటున్నారా ఇది మీకోసమే?

 

Kanuma Muggulu 2024: కనుమ పండుగ కూడా సంక్రాంతి పండగలో భాగమే.. ప్రతి సంవత్సరం ఈ పండగను సంక్రాంతి తెల్లవారి రోజున జరుపుకుంటారు. పండగకి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. పండగ రోజు రైతులంతా పశువులను అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక మహిళలైతే ఉదయాన్నే నిద్ర లేచి ఇంటి ముందు వాకిలి నిండా ముగ్గులు వేస్తారు.
 

1 /6

సంక్రాంతి పండగలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజు ముగ్గులు వేయడం ఆనవాయితీగా వస్తుంది. మూడు రోజులపాటు మహిళలంతా ఉదయాన్నే నిద్ర లేచి ముగ్గులు వేస్తారు.

2 /6

కనుమ పండుగ రోజు పూర్వకాలం నుంచి అన్ని రకాల ముగ్గులను వేయడం సాంప్రదాయంగా వస్తోంది. చాలామంది ఈరోజు ఆవుకు సంబంధించిన డిజైన్ ను కలిగిన ముగ్గులను ఎక్కువగా వేస్తారు. అంతేకాకుండా సంక్రాంతి రోజు పెట్టి గొబ్బిలను కూడా కనుమ రోజు కూడా పెడతారు.  

3 /6

కనుమ పండుగ రోజు ఎక్కువగా వేసే ముగ్గులు రథం ముగ్గు ఒకటి. ఈ ముగ్గును పూర్వకాలం నుంచి వెయ్యడం ఆనవాయితీగా వస్తోంది. పండగ రోజు ఈ ముగ్గును వేసి రంగురంగుల కలర్స్‌తో నింపుతారు.  

4 /6

చాలామంది కనుమ పండగ రోజు గంగిరెద్దులతో కూడిన ముగ్గులను కూడా వేస్తారు. ఈ ముగ్గులు పాడి పశువులను సూచిస్తాయి. కాబట్టి కనుమ పండుగ రోజు ఈ ముగ్గులను వేయడం శుభప్రదంగా భావిస్తారు.  

5 /6

కనుమ పండుగ రోజు అందరూ ఎక్కువగా వేసే ముగ్గులు ముత్యాలముగ్గు కూడా ఒకటి.. ఈ ముగ్గు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ ముగ్గును వేసిన తర్వాత దానిని బంతిపూలతో అలంకరిస్తారు. అలాగే కొంతమంది కనుమ పండుగ రోజు ముగ్గులో రేగి పళ్ళను కూడా పోస్తారు.  

6 /6

ఈ రోజు చాలా మంది రథం ముగ్గులు కూడా వేస్తారు. ఈ ముగ్గు డిజైన్‌ ముగ్గు వేయడం పూర్వికుల నుంచి వస్తోంది.