Kamika Ekadashi Vrat: పురాణాల ప్రకారంలో ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉందని చెప్తుంటారు. ముఖ్యంగా కామికా ఏకాదశిని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. విష్ణు దేవుడికి కూడా ఈ తిథి ఎంతో ఇష్టమైనదని పండితులు చెబుతుంటారు.
హిందు క్యాలెండర్ ప్రకారం నెలకు రెండు ఏకాదశిలు వస్తుంటాయి. ఒకటి కృష్ణ పక్షంలోను, మరోకటి శుక్లపక్షంలోను వస్తుంది. ఇవి రెండు కూడా భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ రోజుల్లో ఏచిన్న పూజలు, వ్రతాలు చేసిన కూడా వెయ్యిరెట్లు ఫలితం ఉంటుందని కూడా పండితులు చెప్తుంటారు. అందుకే పండితులు కూడా ఈరోజుల్లో ఎక్కువగా పూజలు చేస్తుంటారు.
పంచాంగం ప్రకారం ఆషాడ మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశిలో వచ్చే తిథిని కామికా ఏకాదశి అని పిలుస్తుంటారు. ఈ నెల చివరన భక్తులు ఈసారి కామికా ఏకాదశిని జరుపుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. జూలై 30 సాయంత్రం 04:44 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే జూలై 31 మధ్యాహ్నం 03:55 గంటలకు ముగుస్తుంది. అదే విధంగా.. ఉదయంపూట సూర్యోదయానికి తిథి ఉండటం వల్ల జూలై 31న కామికా ఏకాదశి జరుపుకుంటారు.అదే విధంగా ఈరోజు భక్తులుచేసుకునే వ్రతాలు,పూజలు మంచి ఫలితాలు ఇస్తాయని చెప్తుంటారు.
ఈసారి ఏకాదశి రోజున ఏర్పడనున్న ప్రత్యేక యాదృచ్ఛికాలు ఏర్పడుతున్నాయి. కామిక ఏకాదశి నాడు ధృవ యోగం ఏర్పడుతోంది. జ్యోతిష్య పండితులు.. ఈ ధృవ యోగాన్ని చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ యోగంలో శ్రీ హరి విష్ణువును పూజిస్తే, భక్తుల కొరికలన్ని నెరవేరుతాయని చెబుతుంటారు. పెళ్లి కానీ వారికి పెళ్లియోగం, ఉద్యోగాలలో ప్రమోషన్లు కూడా లభిస్తాయని చెబుతుంటారు.
కామికా ఏకాదశి రోజున శివ్వాస యోగం కూడా ఏర్పడుతుంది. కామిక ఏకాదశి రోజున మహాదేవుడు శివుడు కైలాస పర్వతం మీద కూర్చుని ఉంటాడని, ఈ సమయంలో చేసే పూజలు, వ్రతాలు మంచి ఫలితాలు ఇస్తాయని పండితులు చెబుతుంటారు. ఈరోజున శివకేశవులను ఆరాధిస్తే మంచి ఫలితాలు కల్గుతాయని చెబుతుంటారు.
కామికా ఏకాదశి రోజున విష్ణువుకు తులసీమాలతో పూజలు చేయాలి. అదే విధంగా..పాలు, పెరుగు, తేనె,నెయ్యి, చక్కెరతో అభిషేకం చేస్తుంటారు. శివుడికి ఈరోజున బిల్వపత్రిలతో అభిషేకం చేస్తే కూడా గొప్ప ఫలితాలు కల్గుతాయని చెబుతుంటారు. కామికా ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే, మనం కోరిన కోరికలన్ని కూడా నెరవేరుతాయని చెబుతుంటారు. ఈ రోజున కేవలం ఫలాలు, పాలతో ఉపవాసం చేస్తే మంచి యోగం కల్గుతుంది.
కామికా ఏకాదశి రోజున స్యూరోదయానికి ముందు నిద్రలేచి,స్నానాదులు పూర్తిచేసుకొవాలి. ఆ తర్వాత శుభ్రమైన వస్త్రాలు ధరించి, పూజచేసే గదిని శుభ్రం చేసుకొవాలి. ఈరోజు ఇంట్లో మాంసం, మద్యంలను ముట్టుకోవద్దు. ఎవరితోను వాదులాటకు అస్సలు దిగవద్దు. కేవలం సాత్విక ఆహారంను తినాలని కూడా చెబుతుంటారు. ఈరోజున నల్లని చీమలకు బెల్లం, చక్కెరలను పెట్టాలి. పెదలకు తోచిన విధంగా సహాయం చేయాలి. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)