Kaloji Birth Anniversary Celebrations: ప్రజాకవి కాళోజీ నారాయణ రావు 110వ జయంతి వేడుకలను హైదరాబాద్ రవీంద్ర భారతిలో పెద్ద ఎత్తున నిర్వహించారు. ఆయన జయంతి సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవ వేడుకల్లో బతుకంతా దేశానిది నాటకాన్ని ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో నటీనటులు అద్భుతంగా నటించి.. వీక్షకుల మెప్పుపొందారు.
పుట్టుక నీది.. చావు నీది బతుకంతా దేశానిది అంటూ తెలంగాణ ఉద్యమానికి జీవం పోశారు ప్రజాకవి కాళోజీ. ఆ మహానీయుడు జన్మదినాన్ని పురుస్కరించుకుని తెలంగాణ భాష దినోత్సవాన్ని హైదరాబాద్ రవీంద్ర భారతిలో భారీగా నిర్వహించారు.
ఈ వేడుకలకు మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయారు. ఈ సందర్భంగా కాళోజీ సేవను ఆయన వివరించారు.
"బతుకంతా దేశానిది" పేరుతో తెలంగాణ ఎథ్నిక్ థియేటర్ ఆర్ట్స్ సొసైటీ (TETA) బృందం నాటకాన్ని అద్భుతంగా రక్తికట్టించింది.
జి.శివ రామ్ రెడ్డి డైరెక్షన్‌లో ఈ నాటకం వీక్షకులను ఆద్యంతం అలరించింది. కాళోజీ జీవితంలో జరిగిన కీలక ఘట్టాలను కథాంశంగా తీసుకుని నాటక రూపంలో ప్రదర్శించారు.
తమ పాత్రల్లో నటీనటుల జీవించారు. వారి హావభావాలు, తెలంగాణ యాసలో చెప్పే డైలాగ్స్ అలరించాయి. మ్యూజిక్ షో ఉత్కంఠభరితంగా సాగింది. కాళోజీ పాత్రలో శివరామ్ రెడ్డి నటనకు ప్రశంసలు దక్కాయి.