Kajal Aggarwal look in Kannappa: కన్నప్పలో పార్వతి మాత పాత్రలో కాజల్ అగర్వాల్.. జ్ఞాన ప్రసూరాంబికగా అదిరిన లుక్..

Kajal Aggarwal as parvathi matha in Kannappa: మంచు విష్ణు కలల ప్రాజెక్ట్ 'కన్నప్ప' చిత్రం నుంచి ప్రతి సోమవారం ఒక క్యారెక్టర్ కు సంబంధించిన లుక్ ను రిలీజ్ చేస్తున్నారు. ఈ సోమవారం ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కు పార్వతి మాతకు  సంబంధించిన లుక్ ను రిలీజ్ చేసారు.

1 /6

Kajal Aggarwal as parvathi matha in Kannappa: మంచు విష్ణు టైటిల్ రోల్లో యాక్ట్ చేస్తోన్న భారీ పౌరాణిక చిత్రం ‘కన్నప్ప’. హిందీ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. శ్రీకాళమస్తిశ్వర స్వామి భక్తుడిగా కన్నప్ప గొప్పదనాన్ని ప్యాన్ ఇండియా ప్రేక్షకులు తెలిసేలా మంచు మోహన్ బాబు ఈ సినిమాను భారీ స్టార్ క్యాస్ట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ మహా శివుడి పాత్రలో నటిస్తున్నారు.  

2 /6

అటు ప్రభాస్ నంది పాత్రలో నటిస్తున్నట్టు చెప్పారు. కానీ క్లారిటీ లేదు. మోహన్ లాల్ ఈ సినిమా కిరాత పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మంచు విష్ణు సరసన ప్రీతి ముకుందన్ నటిస్తున్నారు.

3 /6

ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ పార్వతి పాత్రలో నటిస్తున్నట్టు అఫీషియల్ గా ప్రకటించడంతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. శ్రీకాళహస్తికి సంబంధించిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక పాత్రలో నటిస్తోంది.

4 /6

అద్భుతమైన స్టార్ క్యాస్ట్‌తో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతుంది. క‌న్న‌ప్ప‌లో మంచు విష్ణు టైటిల్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇప్పటికే  బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన క్యారెక్టర్‌కు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసారు.

5 /6

ఆ తరువాత రెబల్ స్టార్ ప్రభాస్‌ సెట్‌లోకి రావడం.. ఇలా ప్రతీ ఒక్క అప్డేట్‌తో కన్నప్ప నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతూనే వస్తోంది. ఈ సినిమాలో మోహన్ బాబు మహాదేవ శాస్త్రి పాత్రలో నటిస్తున్నారు. కన్నప్పను ముప్పతిప్పలు పెట్టే పాత్రలో నటిస్తున్నారు.

6 /6

ఈ చిత్రాన్ని ఎక్కువగా న్యూజిలాండ్‌లోని అందమైన లొకేషన్స్ లో  చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైద్రాబాద్‌లో జరుగుతోంది. ఈ చిత్రాన్ని ముందుగా గతేడాది విడుదల చేద్దామనుకున్నారు. కానీ ఏప్రిల్ 25న ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.