Devara Kerala Collections: ‘దేవర’ కేరళ బాక్సాఫీస్ కలెక్షన్స్.. అక్కడ హిట్టా.. ఫట్టా..

Devara Kerala Box Office Collections: ఆర్ఆర్ఆర్ తర్వాత రెండేళ్ల గ్యాప్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్  హీరోగా యాక్ట్ చేసిన చిత్రం ‘దేవర’. రీసెంట్ గా ఈ మూవీ రూ. 500 కోట్ల కోట్ల క్లబ్బులో ప్రవేశించింది. తాజాగా ఈ సినిమా కేరళ బాక్సాఫీస్ రన్ ముగిసింది. మొత్తంగా అక్కడ ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో చూడండి.

 

1 /7

‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమా తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రీసెంట్ గా రూ. 500 కోట్ల క్లబ్బులో ప్రవేశించింది.

2 /7

విడుదలై నెల రోజులు అవుతున్న  ఇప్పటికీ తెలుగులో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూనే ఉంది దేవర. కొత్త చిత్రాలు విడుదలైన ఈ సినిమా ముందు నిలబడలేకపోతున్నాయి.    

3 /7

ఎన్టీఆర్ హీరోగా నటించిన  ‘దేవర పార్ట్ -1’. మిక్స్ డ్ టాక్ తో ఈ రేంజ్ వసూళ్లను రాబట్టడం మాములు విషయం కాదు. అంతేకాదు రాజమౌళి సినిమా తర్వాత ఏ హీరో అయిన ఫ్లాప్ అందుకుంటాడనే సెంటిమెంట్ కు బ్రేకులు వేసాడు.

4 /7

అంతేకాదు 2015లో ‘టెంపర్’ మూవీతో మొదలైన ఎన్టీఆర్ విజయ జైత్రయాత్ర .. ‘దేవర’ వరకు కంటిన్యూ అవుతూనే ఉంది. కంటిన్యూగా తొమ్మిదేళ్ల నుంచి అపజయం ఎరగని హీరోగా టాలీవుడ్ లో ఈ జనరేషన్ లో హైయ్యెస్ట్ సక్సెస్ రేట్ ఉన్న హీరోగా నిలిచాడు. 

5 /7

‘దేవర’ మూవీ తెలంగాణ (నైజాం)లో రికార్డు బ్రేక్ కలెక్షన్స్ తో రాబట్టింది. మొత్తంగా ఇక్కడ రూ. 64 కోట్ల షేర్ రాబట్టింది. ఓవరాల్ గా తెలుగులో రూ. 170 కోట్ల షేర్ (రూ. 280 కోట్ల గ్రాస్ ) వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

6 /7

ఇక ‘దేవర’ మూవీ కేరళ విషయానికొస్తే.. అక్కడ రూ. 1 కోటి ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే.. దాదాపు రూ. 1 కోటి 5 లక్షల కలెక్షన్స్ తో అక్కడ బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని అక్కడ సాలిడ్ హిట్ అందుకున్నాడు.

7 /7

తారక్ విషయానికొస్తే.. దేవర తర్వాత ‘దేవర పార్ట్ 2’ సినిమా చేస్తున్నాడు. దీంతో పాటు ‘వార్ 2’, ప్రశాంత్ నీల్ తో చేస్తోన్న ‘డ్రాగన్’ మూవీలు లైన్ లో ఉన్నాయి.