Jio IPL Offeres: క్రికెట్ అభిమానులకు రిలయన్స్ జియో గుడ్‌న్యూస్ చెప్పింది. ఐపీఎల్ కోసం మూడు కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఐపీఎల్ మార్చి 31 నుంచి ప్రారంభం కానుండగా.. జియో టీవీలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో జియో మరింత డేటాతో మూడు ప్లాన్లను ప్రవేశపెట్టింది. కొత్త ప్లాన్లతో 40 జీబీ వరకు డేటాను ఉచితంగా అందిస్తోంది. దీంతో ఎలాంటి చింత లేకుండా ఐపీఎల్‌ను నాన్‌స్టాప్‌గా వీక్షించవచ్చు. మూడు ప్లాన్ల వివరాలు..
జియో రూ.999 ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 3 జీబీ డేటా, అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది. అంతేకాకుండా జియో వినియోగదారులు 40జీబీ డేటాతో సహా 241 రూపాయల ఉచిత వోచర్‌ను కూడా పొందుతారు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు.
జియో రూ.399 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులోకి ఉంటుంది. రోజుకు 3 జీబీ డేటా ఉంటుంది. ఈ ప్లాన్‌లో రూ.61 ఉచిత వోచర్‌తోపాటు 6 జీబీ అదనపు డేటాను అందిస్తుంది. ప్లాన్‌లో అపరిమిత కాలింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.
జియో రూ.219 ప్లాన్ 14 రోజుల చెల్లుబాటులో ఉంటుంది. ఇందులో రోజుకు 3 జీబీ డేటా, అపరిమిత కాలింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది. అంతేకాకుండా జియో వినియోగదారులకు 2 జీబీ ఉచిత డేటాను ఇస్తుంది.
కంపెనీ మూడు కొత్త డేటా ఆన్ ప్లాన్లను కూడా ప్రకటించింది. రూ.222 డేటా యాడ్-ఆన్ ప్యాక్ 50 జీబీ డేటాను అందిస్తుంది. మీ ప్రస్తుత ప్రీపెయిడ్ ప్లాన్ వరకు చెల్లుబాటు అవుతుంది. 444 రూపాయల జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లో 60 రోజుల చెల్లుబాటు వ్యవధితో 100 జీబీ డేటా ఉంటుంది. చివరగా రూ.667 జియో డేటా యాడ్-ఆన్ ప్యాక్ 150 జీబీ డేటాను అందిస్తుంది. 90 రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది.
ఈ కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు మార్చి 24 నుంచి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు జియో ప్రకటించింది.