Janmashtami 2024: ఛప్పన్ భోగ్ అంటే ఏమిటి..?.. జన్మాష్టమి రోజు.. చిన్ని కృష్ణుడికి సమర్పించాల్సిన నైవేద్యాలు ఏంటో తెలుసా..?..

Janmashtami 2024 and Chappan Bhog: శ్రీకృష్ణ జన్మాష్టమిని భక్తులు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ సారి శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు 26 న జరుపుకోనున్నారు. అదేవిధంగా రోహిణి నక్షత్రంలో శ్రీ కృష్ణుడు జన్మించాడని చెబుతున్నారు. కన్నయ్యకు చాలా మంది.. 56 రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. దీన్ని ఛప్పన్ భోగ్ అని పిలుస్తుంటారు. 

1 /7

ఈ ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమిని ఆగస్టు 26 న జరుపుకోనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 26వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆగస్టు 27వ తేదీ తెల్లవారుజామున 12.44 గంటల వరకు కృష్ణ జన్మాష్టమికి పూజా కార్యక్రమాలు జరుపుకుంటారు. జన్మాష్టమి రోజున రోహిణి నక్షత్రం మధ్యాహ్నం 03:55 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 27వ తేదీ మధ్యాహ్నం 03:38 గంటలకు ముగుస్తుందని తెలుస్తోంది.  

2 /7

శ్రీ కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణి, శ్రీకృష్ణ జయంతి, శ్రీ జయంతి అని కూడా పిలుస్తారు. విష్ణువు అవతారంగా భావించే శ్రీకృష్ణుడికి హిందూ మతంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఈరోజున శ్రీకృష్ణుడికి కొన్నినైవేద్యాలు అర్పిస్తే.. జీవితంలో  గొప్పమార్పులు చోటు చేసుకుంటాయని చెబుతుంటారు.

3 /7

శ్రీకృష్ణుడికి వెన్నంటే  అత్యంత ఇష్టమైన నైవేద్యంగా చెబుతుంటారు. బాల్యంలో కన్నయ్య.. గోకులంలో వెన్నను దొంగచాటున అనేక సంద్భాలలో తిన్నాడు. అంతేకాకుండా.. గోకులంలో మహిళలంతా.. వెన్నదొంగ అని పిలుచుకునేవారు.

4 /7

మోతీచూర్ లడ్డంటే కూడా కన్నయ్యకు ఎంతో ఇష్టమంట. అందుకు చాలామంది శ్రీకృష్ణుడికి లడ్డును సమర్పించుకుని మొక్కులు తీర్చుంకుంటారు. ముఖ్యంగా సంతానం లేనివారు కన్నయ్యకు.. లడ్డును సమర్పిస్తారు.

5 /7

కాజు, కిస్మిస్, ఖర్జురాలతో చేసిన పాయసం అంటే కన్నయ్యకు ఎంతో ఇష్టమంట. అందుకే చాలా మంది ఇంట్లో పండుగలు ఉన్నప్పుడు తప్పకుండా పాయసం చేసి నైవేద్యం సమర్పిస్తారు.  

6 /7

సిరను కూడా చాలా మంది దేవుళ్లకు నైవేద్యంగా సమర్పిస్తారు. ముఖ్యంగా ఉపవాసాలు ఉన్నసమయంలో చాలా మంది సిరను ఇష్టంతో తింటారు. మనస్సులో బలమైన తీరని కోరికలు ఉంటే.. సిరను నైవేద్యంగా సమర్పిస్తే తీరుతాయని చెబుతుంటారు.  

7 /7

పాలను బాగా కాచీన తర్వాత.. మీగడ వస్తుంది. ఈ మీగడతో కలకంద్ ను తయారు చేస్తుంటారు. దీనిలో నెయ్యి, చక్కెర వేసి బాగా మరిగిస్తారు. ఇలా చేసిన తర్వాత మంచి వెన్నపైకి వస్తుంది. దీంతో కలకంద్ ను తయారు చేస్తారు.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)