Jammu Kashmir Pics: భూతల స్వర్గం జమ్ము కశ్మీర్‌లో గడ్డకట్టిన దాల్ సరస్సు, పోటెత్తుతున్న పర్యాటకులు

భూతల స్వర్గంగా పిల్చుకునే జమ్ము కశ్మీర్ లోయల్లో మంచు విపరీతంగా పెరిగిపోయింది. చలిగాలులు తీవ్రమయ్యాయి. ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలకు పడిపోయింది. శ్రీనగర్‌లో ఇవాళ కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 3.8 డిగ్రీలు నమోదైంది. జమ్ములో అత్యంత తక్కువ ఉష్ణోగ్రత ఉంది. జమ్ము కశ్మీర్ పర్యాటకుల్ని ప్రధానాకర్షణగా అలరించే దాల్ సరస్సు సగానికిపైగా గడ్డకట్టుకుపోయింది. ఇంకేముందు సరస్సు అందాలు మరింత ద్విగుణీకరిస్తున్నాయి.

Jammu Kashmir Pics: భూతల స్వర్గంగా పిల్చుకునే జమ్ము కశ్మీర్ లోయల్లో మంచు విపరీతంగా పెరిగిపోయింది. చలిగాలులు తీవ్రమయ్యాయి. ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలకు పడిపోయింది. శ్రీనగర్‌లో ఇవాళ కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 3.8 డిగ్రీలు నమోదైంది. జమ్ములో అత్యంత తక్కువ ఉష్ణోగ్రత ఉంది. జమ్ము కశ్మీర్ పర్యాటకుల్ని ప్రధానాకర్షణగా అలరించే దాల్ సరస్సు సగానికిపైగా గడ్డకట్టుకుపోయింది. ఇంకేముందు సరస్సు అందాలు మరింత ద్విగుణీకరిస్తున్నాయి.

1 /5

2 /5

ఉత్తర కశ్మీర్‌లోని కుప్వాడా నగరంలో కనీస ఉష్ణోగ్రత మైనస్ 3.9 డిగ్రీలు నమోదైంది. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన గుల్మార్గ్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 4.2 డిగ్రీలు నమోదైంది. జమ్ములో వాతావరణం కనిష్టంగా మైనస్ 4.7 డిగ్రీలు నమోదైంది. 

3 /5

కశ్మీర్, లడ్డాఖ్ లోయలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో మైనస్ ఉష్ణోగ్రతలే నమోదౌతున్నాయి. కాజీగుండ్ కనిష్ట ఉష్ణోగ్రత జీరో నుంచి మైనస్ 3.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం పహల్ గామ్‌లో కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 5.1 డిగ్రీలు నమోదైంది. కోకర్ నాగ్‌లో కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 2.44 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.

4 /5

జమ్ము కశ్మీర్‌లో ఇప్పుడున్న వాతావరణం చాలా థ్రిల్లింగ్‌గా ఉందని, మంచు ఎక్కువయ్యే కొద్దీ ఇక్కడి అందాలు మరింతగా పెరుగుతున్నాయని, సరస్సు అందాలు రెట్టింపయ్యాయంటున్నారు పర్యాటకులు.

5 /5

జమ్ముకశ్మీర్‌లో ఇప్పుడున్న వాతావరణం పర్యాటకుల్ని విపరీతంగా ఆకర్షిస్తోంది. వేలాదిమంది పర్యాటకులు కశ్మీర్ ఇతర ప్రాంతాల్ని సందర్శిస్తున్నారు. గుల్మార్గ్, పహల్‌గామ్, సోనామార్గ్ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలు పర్యాటకులతో నిండిపోయాయి. శ్రీనగర్‌లోని దాల్ సరస్సుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు పోటెత్తుతున్నారు. కారణంగా సగానికి పైగా సరస్సు మంచుతో గడ్డకట్టుకుపోయింది.