Jabardasth Varsha Photoshoot: భారీ వర్షాలు కురుస్తున్న తరుణంలో సోషల్ మీడియాలో అందాల వర్షం కురిపించింది జబర్దస్త్ వర్ష. ఎల్లో చుడీదార్‌లో అవుట్ డోర్ ఫొటోషూట్ చేసింది. ఈ పిక్స్‌ను నెట్టింట షేర్ చేయగా.. అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆ ఫొటోలను మీరూ చూసేయండి.
సమంత లాగా ఉన్నావంటూ వర్షను ఆకాశానికి ఎత్తుతున్నారు. బ్యూటీఫుల్ లుక్ అని.. విలేజ్ అమ్మాయిలా ఉన్నావంటూ పొగుడుతున్నారు.
జబర్దస్త్ షోతో బుల్లితెరపై భారీ పాపులారిటీ సంపాదించుకుంది వర్ష. ఇమ్మాన్యూయేల్‌తో ఆన్ స్క్రీన్ లవ్ ట్రావ్ బాగానే వర్కవుట్ అయింది.
రష్మీ-సుధీర్ జోడి తరువాత ఈ జంటకే ఎక్కువ పేరు వచ్చింది. వీరిద్దరి మధ్య వచ్చే సీన్లు కూడా ఆడియన్స్‌కు తెగ నవ్వును తెప్పిస్తాయి.
ప్రస్తుతం జబర్దస్త్‌తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో షో మెరుస్తోంది వర్ష. త్వరలో బిగ్ బాస్ సీజన్-7లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు ఈ భామ సోషల్ మీడియాలో ఫొటోషూట్స్‌తో ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తోంది. తాజాగా షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.