Gaganyaan Launch: అంతరిక్షానికి ఇండియా సరికొత్త చిరునామాగా మారుతోంది. మొన్న చంద్రుడిపై , నిన్న సూర్యుడిపై విజయం తరువాతక ఇస్రో తదుపరి యాక్షన్‌పై ప్రపంచమంతా దృష్టి కేంద్రీకరించింది. అంతా ఇస్రో వైపు చూస్తోంది. ఇస్రో ఈసారి ఏం చేయనుందనేది ఆసక్తి రేపుతోంది.
Gaganyaan Launch: చంద్రయాన్ విజయం సాధించిన రోజుల వ్యవధిలోనే ఇస్రో విజయవంతంగా సూర్యునిపైకి ఆదిత్య ఎల్1 మిషన్ ప్రయోగించింది. ఇప్పుడిక ఇస్రో గగన్‌యాన్‌కు సిద్ధమౌతోంది. గగన్‌యాన్ ఈ ఏడాది అక్టోబర్‌లో ఉండవచ్చని అంచనా.
గగన్‌యాన్ మిషన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ సక్సెస్ కావాలనే ఆలోచనతో ఇస్రో అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇది మానవ మిషన్ కావడంతో అత్యంత జాగ్రత్తగా అన్ని విషయాలు పరిశీలిస్తున్నారు.
అంతరిక్ష యాత్రికుల్ని ఎంపిక చేయమని ఇస్రో భారత వైమానిక దళానికి సూచించింది. ఈ మిషన్‌లో ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్లను కూడా భాగం చేశారు. ఎయిర్‌ఫోర్స్ నుంచి కూడా కొంతమంది సైనికుల్ని ఎంపిక చేశారు. బెంగళూరులో వీరికి శిక్షణ జరుగుతోంది.
గగన్‌యాన్ స్పేస్ ఫ్లైట్ మిషన్‌లో భాగంగా అంతరిక్ష యాత్రికుల్ని పంపించనున్నారు. గగన్‌యాన్ మిషన్ కింద ఇస్రో తన ఆస్ట్రోనాట్స్‌ను భూమి నుంచి 400 కిలోమీటర్ల పైన తిప్పనుంది.
మొదటి, రెండవ పరీక్షలు విజయవంతమైన తరువాత 2024 చివరినాటికి మిషన్ ప్రయోగించవచ్చు.
మొదటి పరీక్ష టీవీ-డీ1 2023లో ఉండవచ్చు. ఆ తురవాత రెండవది టీవీ-డీ2 2024 తొలి త్రైమాసికంగా ఉండే అవకాశాలున్నాయి. ఇది తొలి మానవ రహిత మిషన్ కానుంది.
అక్టోబర్ నెలలో గగన్‌యాన్ ప్రయోగం ఉండవచ్చని చెప్పిన కేంద్ర మంత్రి తేదీ ఎప్పుడనేది చెప్పలేదు. ఇంకా ఇస్రో నుంచి కూడా ఈ విషయంపై స్పష్టత లేదు.
కేంద్ర మంత్రి జితేంద్ర సింహ్ అందించిన వివరాల ప్రకారం గగన్‌యాన్ ప్రాజెక్ట్ అక్టోబర్‌లో పరీక్షించవచ్చని తెలుస్తోంది.