IRCTCలో సరికొత్తగా Bus Tickets బుకింగ్ సౌకర్యం, 22 రాష్ట్రాల్లో ప్రయాణికులకు సేవలు

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC) మరో సరికొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇకనుంచి రైలు టికెట్లతో పాటు బస్ టికెట్లను సైతం ఆన్‌లైన్‌లో బుకింగ్‌ను ప్రవేశపెట్టింది. 

1 /5

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC) మరో సరికొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇకనుంచి రైలు టికెట్లతో పాటు బస్ టికెట్లను సైతం ఆన్‌లైన్‌లో బుకింగ్‌ను ప్రవేశపెట్టింది. జనవరి 29 నుంచి బస్ టికెట్ల బుకింగ్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తాజాగా ఐఆర్‌సీటీసీ ఓ ప్రకటనలో తెలిపింది. Also Read: Ujjwala Yojana: Free LPG కనెక్షన్, రూ.1600 రావాలంటే PMUY వివరాలు తెలుసుకోండి

2 /5

ఐఆర్‌సీటీసీలో ఇదివరకే ఆన్‌లైన్‌‌లో రైలు, విమాన టికెట్లు బుకింగ్ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఇటీవల తాము బస్ టికెట్ల బుకింగ్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖతో కలిసి  ఐఆర్‌సీటీసీ ఈ తాజా సేవల్ని కూడా అందుబాటులోకి తెచ్చింది. (Photo: irctc)

3 /5

బస్ టికెట్లను బుక్ చేసుకోవాలంటే ఈ వెబ్‌సైట్  https://www.bus.irctc.co.in/home లోకి వెళ్లాలి. ఆ హోం పేజీలో మీరు బస్సు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఒకేసారి గరిష్టంగా 6 బస్ టికెట్లు బుక్ చేసుకునే సౌకర్యాన్ని IRCTC కల్పిస్తోంది. Also Read: Also Read: International Flights: అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం పొడిగించిన DGCA

4 /5

మార్చి మొదటి వారం నుంచి ఐఆర్‌సీటీసీ బస్ టికెట్ బుకింగ్ సర్వీసు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. మొబైల్ యాప్‌లోనూ టికెట్లు బుక్ చేసుకునేలా మార్పులు చేస్తున్నారు. Also Read: Income Tax: ఇన్‌కమ్ ట్యాక్స్ లేని దేశాలు కూడా ఉన్నాయి, No Income Tax దేశాలు ఇవే

5 /5

పలు రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన మొత్తం 50 వేల బస్సులతో పాటు ప్రైవేట్ బస్సులు సేవల్ని అందించనున్నాయి. 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఐఆర్‌సీటీసీ బస్ టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చునని సూచించింది.