Iqoo 13 Launch Date: వావ్‌.. ఇక Iqoo 13 మొబైల్‌ కూడా వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ లీక్‌!

Iqoo 13 Launch Date: మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? త్వరలోనే iQOO 13 స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో లాంచ్‌ కాబోతోంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అలాగే అత్యధిక తగ్గింపుతో అందుబాటులో ఉంది. 


Iqoo 13 Launch Date: ప్రముఖ చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ iQOO గుడ్‌ న్యూస్‌ తెలిపింది. తమ iQOO 13 సిరీస్‌ మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీనిని కంపెనీ మొదట చైనాలో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ స్నాప్‌డ్రాగన్ 8-సిరీస్ చిప్‌తో రన్‌ కాబోతున్నట్లు తెలిపింది. ఇది ప్రీమియం  CPU, GPU సెటప్‌లతో అద్భుతమైన పనితీరును కలిగి ఉంటుంది. ఇవే కాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌ బోలెడు ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ iQOO 13 స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1 /5

ఈ iQOO 13 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే, ఇది 2K Q10 ఎవరెస్ట్ డిస్‌ప్లే సెటప్‌తో వస్తోంది. అంతేకాకుండా  దీనిని కంపెనీ BOE సపోర్ట్‌తో అభివృద్ధి చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మొబైల్ డిస్ల్పే 6.82-అంగుళాల ఫ్లాట్ OLED ప్యానెల్‌తో రానుంది. అంతేకాకుండా ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్‌తో రాబోతోంది.  

2 /5

ఈ మొబైల్‌ అద్భుతమైన ఫిక్చర్‌ అనుభూతిని అందించేందుకు  2K రిజల్యూషన్‌ను కలిగి ఉండబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌  6,150mAh బ్యాటరీ సెటప్‌ను కలిగి ఉంటుంది.

3 /5

అంతేకాకుండా ఈ iQOO 13 స్మార్ట్‌ఫోన్‌ 120W ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ప్రీమియం డిజైన్‌తో అందుబాటులోకి రానుంది. ఇవే కాకుండా స్లిమ్‌ డిజైన్‌ సెటప్‌ను కలిగి ఉంటుంది. 

4 /5

iQOO 13 స్మార్ట్‌ఫోన్‌ మూడవ తరం సిలికాన్ నెగటివ్ ఎలక్ట్రోడ్ టెక్నాలజీని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇది OriginOS 5పై రన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా AI ప్రత్యేకమైన ఫీచర్స్‌తో వస్తోంది.

5 /5

ఈ iQOO 13 స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ డిసెంబర్ మొదటి వారంలో అందుబాటులోకి తీసుకు రానుంది. అంతేకాకుండా గేమింగ్ కోసం ఆప్టిమైజ్ సెటప్‌ను కూడా అందిస్తోంది.