2 Crore Base Price Players: ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన టీ20 లీగ్ ఐపీఎల్ మినీ వేలం డిసెంబర్ 23న జరుగుతోంది. ఈ వేలంలో భారత్‌తోపాటు విదేశీ ఆటగాళ్లు మొత్తం 991 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఈసారి వేలం కూడా పోటాపోటీగా సాగనుంది. బెన్ స్టోక్, కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, శ్యామ్ కర్రన్ వంటి ప్లేయర్స్ స్పెషల్ ఆట్రాక్షన్‌గా నిలవనున్నారు. రూ.2 కోట్ల స్లాబ్‌లో ఉన్న విదేశీ ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం..
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తన బేస్ ధర రూ.2 కోట్లతో వేలంలోకి వస్తున్నాడు. విలియమ్సన్ ఇటీవల టీ20 ప్రపంచ కప్-2022లో న్యూజిలాండ్‌ను సెమీ ఫైనల్‌కు చేర్చాడు. గత సీజన్ వరకు సన్‌రైజర్స్‌కు ఆడగా.. ఈ ఏడాది ఆ జట్టు వదుకుకుంది. విలియమ్సన్ ఇప్పటివరకు 87 టీ20 ఇంటర్నేషనల్స్‌లో మొత్తం 2464 పరుగులు చేశాడు. ఇందులో 17 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఇటీవల T20 ప్రపంచ కప్ ఫైనల్లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఈసారి వేలంలో భారీ ధర పలికే అవకాశం ఉంది. రూ.2 బేస్ ప్రైస్‌తో వేలంలోకి వస్తున్నాడు. స్టోక్స్ కోసం అన్ని జట్లు పోటీ పడే అవకాశం ఉంది. 31 ఏళ్ల స్టోక్స్ మొత్తం 157 టీ20 మ్యాచుల్లో 3008 పరుగులు చేసి 93 వికెట్లు పడగొట్టాడు.
ఇంగ్లండ్‌కు చెందిన 24 ఏళ్ల ఆల్ రౌండర్ శ్యామ్ కర్రన్ కూడా రూ.2 కోట్ల జాబితాలో చేరాడు. ఇంగ్లండ్ టీ20 వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ యంగ్ ఆల్‌రౌండర్ కూడా వేలంలో మంచి ధర పలికే అవకాశం ఉంది. ఇప్పటివరకు అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 41 వికెట్లు పడగొట్టాడు. మొత్తం 158 పరుగులు చేశాడు.
వెస్టిండీస్‌కు చెందిన టాప్ ఆల్‌రౌండర్ జేస్సన్ హోల్డర్ కూడా రూ.2 కోట్లతో వేలంలోకి వస్తున్నాడు. గత సీజన్లో లక్నో సూజర్ జెయింట్స్‌కు ఆడాడు. ఈ ఏడాది ఆ జట్టు వదులుకుంది. ఈ ఆల్‌రౌండర్‌కు కూడా మంచి ధర లభించే ఛాన్స్ ఉంది.
వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ కూడా రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలంలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. గతేడాది సన్ రైజర్స్ హైదరాబాద్‌కు ఆడిన పూరన్.. కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయినా హైదరాబాద్ జట్టు పూరన్ జట్టు నుంచి రిలీజ్ చేసింది. అతను ఇప్పటివరకు 256 టీ20 మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ, 27 హాఫ్ సెంచరీలతో కలిపి 4942 పరుగులు చేశాడు.
శ్రీలంకకు చెందిన 35 ఏళ్ల ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ కూడా రూ.2 కోట్ల స్లాబ్‌లో తన పేరు నమోదు చేసుకున్నాడు. టీ20లో అతని ఓవరాల్ రికార్డ్ చాలా బాగుంది. అతను 173 మ్యాచ్‌లలో 11 అర్ధ సెంచరీలతో మొత్తం 2788 పరుగులు చేసి.. 85 వికెట్లు తీసుకున్నాడు.
క్రిస్ జోర్డాన్, నాథన్ కౌల్టర్ నైల్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, క్రిస్ లిన్, టామ్ బాంటన్, టైమల్ మిల్స్, జామీ ఓవర్టన్, క్రెయిగ్ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, ఆడమ్ మిల్నే, జిమ్మీ నీషమ్, రిలే రోసోవ్, రాస్సీ వాన్ వంటి తదితర విదేశీ ఆటగాళ్లు కూడా రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలంలోకి రానున్నారు.