IPL 2023: డామిట్ కథ అడ్డం తిరిగింది.. కోట్ల ధర పలికి చివరికి..!

IPL 2023 Latest Update: ఆటగాళ్లను రాత్రికి రాత్రే సూపర్ స్టార్‌లను చేసే ఐపీఎల్‌.. పర్ఫామెన్స్‌లో కొంచెం తేడా వచ్చినా దెబ్బకు నేలకు దించేస్తుంది. అలా ఒక ఏడాది వేలంలో భారీ ధర పలికిన ప్లేయర్లు.. మరుసటి వేలంలో తక్కువ ధరకే అమ్ముడుపోయారు. అలాంటి టాప్-5 ఆటగాళ్లపై ఓ లుక్కేయండి.. 

  • Mar 30, 2023, 22:29 PM IST
1 /5

గతేడాది పంజాబ్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన మయాంక్ అగర్వాల్.. ఈసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడనున్నాడు. వేలంలో రూ.8.25 కోట్లకు ఎస్‌ఆర్‌హెచ్ కొనుగోలు చేసింది. గత సీజన్‌లో అతడిని పంజాబ్ కింగ్స్ రూ.14 కోట్లకు అట్టిపెట్టుకుంది. కెప్టెన్‌గా, ఆటగాడిగా ఫ్లాప్‌ అవ్వడంతో మయాంక్‌ను జట్టు నుంచి విడుదల చేసింది.   

2 /5

వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఒడియన్ స్మిత్‌ను రూ.50 లక్షలకే గుజరాత్ టైటాన్స్ తమ జట్టులో చేర్చుకుంది. ఇది అతని బేస్ ధర. గత సీజన్‌లో ఒడియన్ స్మిత్‌ను పంజాబ్ కింగ్స్ రూ.6 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. 

3 /5

వెస్టిండీస్‌కు చెందిన మరో హార్డ్ హిట్టర్ రొమారియో షెపర్డ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ.50 లక్షల బేస్‌ ప్రైస్‌కే వేలంలో దక్కించుకుంది. రొమారియో షెపర్డ్ గతేడాది రూ.7.5 కోట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అమ్ముడుపోయాడు.  

4 /5

ఎస్‌ఆర్‌హెచ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను కేవలం రూ.2 కోట్ల బేస్ ధరతో గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది. గత సీజన్‌లో హైదరాబాద్ రూ.16 కోట్లు ఇచ్చి కేన్ విలియమ్సన్‌ను తన వద్దే ఉంచుకుంది. ఈసారి మొత్తం రూ.14 కోట్ల నష్టాన్ని చవిచూశాడు.  

5 /5

కైల్ జేమిసన్ బేస్ ధర కోటి రూపాయలకే చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. అంతకుముందు కైల్ జేమిసన్‌ను 2021 సంవత్సరంలో రూ.15 కోట్లకు దక్కించుకుంది. ఈ సారి రూ.14 కోట్ల నష్టంతో చెన్నై జట్టులో చేరాడు. అయితే గాయం కారణంగా ఈ ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు