IPL 2023 Centuries: ఈ సీజన్‌లో సెంచరీ వీరులు వీళ్లే.. అత్యధిక స్కోరు ఎంతంటే..?

IPL 2023 Records: ప్రతి సీజన్‌లో మాదిరే ఈసారి ఐపీఎల్‌లోనూ బ్యాట్స్‌మెన్ల అద్భుత పర్ఫామెన్స్ కొనసాగుతోంది. ముఖ్యంగా ఈ సీజన్‌లో యంగ్ క్రికెటర్లు సత్తా చాటుతూ టీమిండియా చోటు కోసం సిగ్నల్స్ పంపించారు. ఐపీఎల్ 2023లో శతకాలు బాదిన ప్లేయర్లపై ఓ లుక్కేయండి.
 

1 /6

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై సెంచరీ బాదిన గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్.. 100 మార్క్ చేరుకున్న తొలి గుజరాత్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. సోమవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్ 58 బంతుల్లో 13 బౌండరీలు, ఒక సిక్సర్ సాయంతో 101 పరుగులు చేశాడు.  

2 /6

పంజాబ్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ఈ సీజన్‌లో శతకం బాదేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై చెలరేగి ఆడాడు. 22 ఏళ్ల సిమ్రాన్ సింగ్.. 65 బంతుల్లో 103 పరుగులు చేశాడు. దీంతో ఢిల్లీ జట్టుపై పంజాబ్ సునాయసంగా విజయం సాధించింది. 

3 /6

టీమిండియా మిస్టర్ 360గా పేరు తెచ్చుకున్న ముంబై బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్‌లో తన తొలి సెంచరీని నమోదు చేసుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌‌పై  కేవలం 49 బంతుల్లో అజేయంగా 103 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.   

4 /6

ఈ సీజన్‌లో సెంచరీ బాదిన మూడో ఆటగాడు రాజస్థాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన తొలి ఐపీఎల్ సెంచరీని కొట్టేశాడు. కేవలం 62 బంతుల్లో 124 పరుగులు చేశాడు. ఐపీఎల్‌ 2023 ఆరెంజ్ క్యాప్‌లో రేసులో యశస్వి జైస్వాల్ దూసుకుపోతున్నాడు.   

5 /6

కోల్‌కతా నైట్ రైడర్స్‌ ఆటగాడు వెంకటేష్ అయ్యర్ ఈ సీజన్‌లో సెంచరీ చేసిన రెండో ప్లేయర్. ముంబై ఇండియన్స్‌పై అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కేవలం 51 బంతుల్లో 104 పరుగులు చేశాడు. బ్రెండన్ మెకల్లమ్ తర్వాత కోల్‌కతా తరుఫున సెంచరీ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు.   

6 /6

ఎస్‌ఆర్‌హెచ్ బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్ ఈ సీజన్‌లో తొలి సెంచరీ చేసిన ప్లేయర్. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రూక్ చెలరేగి ఆడాడు. కేవలం 55 బంతుల్లో 100 పరుగుల స్కోరుతో అజేయంగా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్‌ మినహాయించి మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లో బ్రూక్ దారుణంగా విఫలమయ్యాడు.