IPL 2021 Auction Latest Updates: ఐపీఎల్ 2021 మినీ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు వీరే

 ఐపీఎల్ 2021 మినీ వేలంలో కొందరు ఆటగాళ్లు అమ్ముడుపోని కారణంగా ఆశ్చర్యానికి లోగా, మరికొంరు ఆటగాళ్ల అథ్యధిక ధరతో క్రికెట్ అభిమానులకు షాకిచ్చారు. (Photo: Twitter/IPL)

  • Feb 18, 2021, 17:29 PM IST

IPL 2021 Auction Costliest Players List: ఐపీఎల్ 2021 మినీ వేలంలో కొందరు ఆటగాళ్లు అమ్ముడుపోని కారణంగా ఆశ్చర్యానికి లోగా, మరికొంరు ఆటగాళ్ల అథ్యధిక ధరతో క్రికెట్ అభిమానులకు షాకిచ్చారు. (Photo: Twitter/IPL)

1 /10

చెన్నైలో 3 గంటలకు ఐపీఎల్ 2021 వేలం ప్రారంభంది. వేలంలో మొత్తం 292 మంది ప్లేయ‌ర్స్ పాల్గొనగా.. ఇందులో 164 మంది డొమెస్టిక్ ప్లేయర్లు,  125 మంది విదేశీ ఆటగాళ్లు వేలానికి రాగా మొత్తం 61 మందినే కొనుగోలు చేస్తారు. (Photo: Twitter/IPL)

2 /10

ఐపీఎల్ వేలం చరిత్రలోనే క్రిస్ మోరిస్ అత్యధిక ధర పలికాడు. 16.25 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ క్రిస్ మోరిస్‌ను తీసుకుంది. గతంలో 16 కోట్లకు అమ్ముడైన యువరాజ్ సింగ్ రికార్డును బద్ధలుకొట్టిన క్రిస్ మోరిస్. (Photo: Twitter/IPL)

3 /10

ఐపీఎల్ 2021 వేలంలో ఊహించని మొత్తంలో రూ.14.25 కోట్లకు గ్లెన్ మ్యాక్స్‌వెల్‌‌ను తీసుకున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ ఎక్కువ మొత్తం వెచ్చించి మ్యాక్స్‌వెల్‌ను తీసుకుంది. (Photo: Twitter/IPL)

4 /10

జే రిచర్డ్‌సన్‌ను పంజాబ్ కింగ్స్ జట్టు ఏకంగా రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది.  (Photo: Twitter/IPL)

5 /10

రూ.9.25 కోట్లకు ఆల్‌రౌండ‌ర్ గౌత‌మ్‌ క్రిష్ణప్పను కొనుగోలు చేసిన చెన్నై సూపర్ కింగ్స్. (Photo: Twitter/IPL)

6 /10

తాజా వేలంలో రూ. 7 కోట్లకు ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ మోయిన్ అలీని చెన్నై సూపర్ కింగ్స్ తీసుకుంది. ఇటీవల టీమిండియాతో జరిగిన రెండో టెస్టులో వరుస సిక్సర్లు బాదడంతో భారీ ధరకు అమ్మడయ్యాడు. (Photo: Twitter/IPL)

7 /10

పంజాబ్ కింగ్స్ జట్టు రూ.5.25 కోట్లకు షారుఖ్ ఖాన్‌ను కొనుగోలు చేసింది.  (Photo: Twitter/IPL)

8 /10

టీమిండియా యువ ఆల్ రౌండర్ క్రికెటర్ శివమ్‌ దూబేను రాజస్థాన్ రాయల్స్ రూ.4.40 కోట్లకు కొనుగోలు చేసింది. (Photo: Twitter/IPL)

9 /10

బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీల్ అల్ హసన్‌ను రూ. 3.20 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ తీసుకుంది. గతంలోనూ ఆ ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహించాడు షకీబ్. (Photo: Twitter/IPL)

10 /10

ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2.20 కోట్లకు స్టీవ్ స్మిత్‌ను తీసుకుంది. రాజస్థాన్ రాయల్స్ వదులుకోవడంతో వేలంలోకి వచ్చిన స్టీవ్ స్మిత్ తక్కువ ధరకే వెళ్లాడు. (Photo: Twitter/IPL)