iPhone 15 Pro, 15 Pro Max: యాపిల్ కంపెనీ విడుదలు చేసిన ఐఫోన్ 15 ప్రో, 15 ప్రో మాక్స్ స్మార్ట్ ఫోన్స్ అనేక రకాల కొత్త ఫీచర్స్‌ను కలిగి ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌లకి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
iPhone 15 Pro, 15 Pro Max: యాపిల్ తమ కస్టమర్స్‌కి గుడ్ న్యూస్ తెలిపింది. వండర్ స్ట్ లాంచ్ ఈవెంట్లో భాగంగా యాపిల్ కంపెనీ ఐఫోన్ 15 సిరీస్ స్మార్ట్ ఫోన్స్‌తో పాటు స్మార్ట్ వాచ్‌లను కూడా విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్స్ అనేక రకాల ఫీచర్స్‌ను కలిగి ఉన్నాయి. అయితే మనం ఇప్పుడు ఐఫోన్ 15 ప్రో, 15 ప్రో మాక్స్‌కి సంబంధించిన ఫీచర్స్‌ను మనం ఇప్పుడు తెలుసుకుందాం..
యాపిల్ కొత్త గ్రేడ్ 5 టైటానియం డిజైన్‌తో ప్రో మోడల్స్‌ను పరిచయం చేసింది. ఐఫోన్ 15 ప్రో, 15 ప్రో మాక్స్ రెండింటి స్క్రీన్ ప్రత్యేకమైన షేప్‌లో వచ్చింది. దీంతో పాటు యాపిల్ 15 Pro 6.1 అంగుళాలు, 15 Pro Max 6.7 అంగుళాల Super Ratina XDR OLED ప్రో-మోషన్ డిస్‌ప్లేను కలిగి ఉంటాయి.
ఈ రెండు మొబైల్స్‌ను బ్లాక్ టైటానియం, వైట్ టైటానియం, బ్లూ టైటానియం వంటి కలర్ ఆప్షన్లలో కంపెనీ లాంచ్ చేసింది. అంతేకాకుండా సైలెంట్ స్విచ్‌కు బదులుగా ఐఫోన్ 15 ప్రో మోడల్‌లు యాక్షన్ బటన్‌ను కలిగి ఉంటుందని కంపెనీ వెల్లడించింది.
యాపిల్ ఐఫోన్ 15 ప్రో మోడల్‌లలో కొత్త స్టాండ్‌బై మోడ్ ఆప్షన్ కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. అంతేకాకుండా మొబైల్ ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు ఆన్‌డిస్‌ప్లే (AOD) ఫీచర్ కారణంగా ముఖ్యమైన నోటిఫికేషన్ వివరాలు షో చేస్తుంది.
ఐఫోన్ 15 ప్రో, 15 ప్రో మాక్స్ A17 ప్రో బయోనిక్ ప్రాసెసర్‌ను కలిగి ఉంటాయి. ఈ మొబైల్స్‌ను 3 నానోమీటర్ చిప్ టెక్నాలజీతో కంపెనీ పరిచయం చేసింది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్స్ 6-కోర్ CPU, 16-కోర్ న్యూరల్ ఇంజన్‌ను కలిగి ఉంటాయి.
ఐఫోన్ 15 ప్రో, 15 ప్రో మాక్స్ వెనుక ప్యానెల్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటాయి. ఈ స్మార్ట్‌ఫోన్స్ 48MP ప్రధాన కెమెరాతో క్వాడ్ పిక్సెల్ సెన్సార్ ఇమేజింగ్ టెక్ సపోర్ట్‌తో యాపిల్ రూపొందించింది. అంతేకాకుండా LiDAR స్కానర్, నైట్ మోడ్ పోర్ట్రెయిట్స్ వంటి చాలా రకాల ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది.