Jellyfish Facts: భూమిపై మరణం లేని ఈ జీవి గురించి తెలుసా..! ఎలా జీవిస్తుందంటే..?

Jellyfish Interesting Facts: "పుట్టిన వారికి మరణం తప్పదు.. మరణించిన వారికి పుట్టుక తప్పదు.." అంటూ సాగే భగవద్గీత శ్లోకం వినే ఉంటారు. ఇది మానవులకే కాదు అన్ని జీవులకు వర్తిస్తుంది. కానీ ఈ సృష్టిలో మరణం లేని జీవి ఒకటి ఉంది. అలాంటి జీవి కూడా ఉంటుందా..? అని ఆశ్చర్యపోతున్నారా..? అవును.. జెల్లీ ఫిష్ అనే జీవికి మరణం ఉండదని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ జీవి కోరుకున్నంత కాలం సజీవంగా ఉంటుందని స్పష్టం చేశారు. జెల్లీ ఫిష్ విశేషాలను ఇక్కడ తెలుసుకోండి.
 

1 /8

టురిటోప్సిస్ డోర్ని అని పిలిచే జెల్లీ ఫిష్ వృద్ధాప్యం ద్వారా మరణించదు. ఇతర జీవులు చంపితోనో లేదా ఏదైనా వ్యాధి సంభవిస్తునో తప్పా ఈ జీవికి మరణించడం సంభవించదు.   

2 /8

ఈ జెల్లీ ఫిష్‌ వయసు ఎంత ఉంటుందనే విషయాన్ని పరిశోధకులు కూడా కనిపెట్టలేకపోయారు.   

3 /8

ఈ జీవికి వయోజన జీవితం నుంచి మళ్లీ లార్వా దశలకు తిరిగి మారగల సామర్థ్యాన్ని ఉంటుంది. ఇలా పరిపక్వం చెందుతూ తన జీవిత కాలాన్ని పెంచుకుంటుంది.  

4 /8

అందుకే ఈ జీవికి మరణం లేదని పరిశోధకులు చెబుతున్నారు. వృద్ధాప్యాన్ని తిప్పికొట్టే సామర్థ్యమే జెల్లీ ఫిష్‌ను మరణం లేని జీవిగా మారేలా చేశాయంటున్నారు.  

5 /8

జెల్లీ ఫిష్‌లు తమకు ప్రమాదం జరిగిందని భావించినా.. అనారోగ్యం ఉందని అనిపించినా పాలిప్ స్థితికి వెళ్లిపోతాయి.  

6 /8

పాలిప్ స్థితి నుంచి మళ్లీ జీవితాన్ని ప్రారంభిస్తాయి. జెల్లీ ఫిష్‌కు నిజంగా మరణం లేదా అనే విషయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.  

7 /8

జెల్లీ ఫిష్‌ను ఏదైనా ఒక పెద్ద చేప మొత్తంగా మింగేస్తే అవి చనిపోతాయని.. వృద్ధాప్యంతో మాత్రం మరణం సంభవించదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  

8 /8

దీని డీఎన్‌ఏ ఆధారంగా మనుషులలో కూడా వృద్ధాప్యాన్ని అధికమించేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి.