Gold Rate: తులం బంగారం ధర అక్షరాలా రూ.2.50 లక్షలు.. ఎక్కడో తెలుసా.?

Gold Price: ఓవైపు బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పడుతూ ఉంటే మరోవైపు పసిడి ప్రియులు పండగ చేసుకుంటున్నారు. బంగారం ధర గడచిన వారం రోజుల్లో దాదాపు 6000 రూపాయల వరకు తగ్గింది.దీంతో పసిడి ప్రియులు పెద్ద ఎత్తున బంగారు నగలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.కానీ భారత్ కు పొరుగున ఉన్న పాకిస్తాన్లో మాత్రం చుక్కలను చూపిస్తున్నాయి.జూలై 30వ తేదీ పాకిస్తాన్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర అక్షరాల రూ. 2.50 లక్షలు అంటే ఆశ్చర్యపోక మానదు.
 
  • Jul 30, 2024, 22:35 PM IST
1 /7

2 /7

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకం భారీగా తగ్గించడంతో దేశవ్యాప్తంగా బంగారు నగల ధరలు తగ్గి వస్తున్నాయి. బడ్జెట్ ప్రకటించిన రోజు బంగారం ధర 10 గ్రాములపై ఏకంగా 4000 రూపాయల వరకు తగ్గింది. ఇక బంగారం ధరలో ప్రస్తుతం భారతదేశంలో 69 వేల రూపాయల సమీపంలో ట్రేడ్ అవుతున్నాయి. ఈ ధరలు 24 క్యారెట్ల 10 గ్రాములకు సంబంధించినవి కావడం గమనార్హం.  

3 /7

అయితే బంగారం ధరలు భారత్ లో తగ్గుముఖం పడుతుంటే పొరుగున ఉన్న పాకిస్తాన్లో మాత్రం చుక్కలను చూపిస్తున్నాయి. జూలై 30వ తేదీ పాకిస్తాన్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర అక్షరాల రూ. 2.50 లక్షలు అంటే ఆశ్చర్యపోక మానదు. 

4 /7

ఎందుకంటే బంగారం ధరలు పాకిస్తాన్ లో  భారీగా పెరుగుతున్నాయి. ఇక ఇక్కడ తులం బంగారం కొనుగోలు చేయాలంటే దాదాపు రెండున్నర లక్షల పైన ఖర్చు చేయడం మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ పేర్కొన్న రూపాయలు పాకిస్తానీ రూపాయలు అని గమనించాలి. భారత కరెన్సీ తో పోల్చినట్లయితే పాకిస్తాన్ కరెన్సీ విలువ చాలా తక్కువ.  

5 /7

భారత్ లోని ఒక రూపాయి పాకిస్తాన్ లో మూడు రూపాయలతో సమానం అందుకే మన దేశంలో ఒక రూపాయి ఖర్చు పెడితే మూడు రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఈ లెక్కన గమనించినట్లయితే, పాకిస్తాన్లో బంగారం ధరలు భారత్ కన్నా మూడు రెట్లు ఎక్కువగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహము లేదు. అయితే పాకిస్తాన్ లో బంగారం ధరలు పెరగటానికి మరొక కారణం అక్కడ పెట్టుబడిదారులు అటు స్టాక్ మార్కెట్ పైన ప్రభుత్వ బాండ్ల పైన కూడా నమ్మకాన్ని కోల్పోయారు.   

6 /7

దీంతో స్థానిక వ్యాపారులు అదేవిధంగా పెట్టుబడిదారులు తమ పెట్టుబడిని మొత్తం బంగారం పైన ఎక్కువగా పెడుతున్నారు. దీంతో పాకిస్తాన్ లో బంగారం ధరలు ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి.    

7 /7

మరోవైపు పాకిస్తాన్లో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా భారీగా ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. పాకిస్తాన్లో లీటర్ పెట్రోల్ ధర రూ.275 ఉంటుంది. అదే సమయంలో డీజిల్ ధర రూ. 270 ఉంటుంది.