Indra Re Release: గత కొన్నేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ ఎక్కువపోయింది. ఈ నేపథ్యంలో గతంలో హిట్టైన బ్లాక్ బస్టర్ మూవీస్ లను మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ రోజుతో 22 యేళ్లు పూర్తి చేసుకున్న చిరంజీవి మెగా బ్లాక్ బస్టర్ ‘ఇంద్ర’ మూవీని ఆయన బర్త్ డే సందర్బంగా రీ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా సాధించిన రికార్డుల విషయానికొస్తే..
తెలుగు సినీ ఇండస్ట్రీలో గత కొన్నేళ్లుగా పాత బ్లాక్ బస్టర్ సినిమాలను రీ రిలీజ్ చేయడం అనే ట్రెండ్ ఎక్కువైపోయింది. కొత్తలో ఈ సినిమాలను ఆదరించిన ప్రేక్షకులు ఇపుడు వాటిని పట్టించుకోవడం మానేశారు.
తాజాగా చిరంజీవి హీరోగా నటించిన ఇండస్ట్రీ హిట్ ‘ఇంద్ర’ మూవీని ఆగష్టు 22న రీ రిలీజ్ చేస్తున్నారు.
‘ఇంద్ర’ చిత్రంలో చిరంజీవి సరసన సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ హీరోయిన్స్ గా నటించారు. అంతేకాదు అప్పట్లో చిరంజీవి.. మృగరాజు, శ్రీ మంజునాథ, డాడీ వంటి ఫ్లాప్ మూవీస్ తో బాధ పడుతున్నాడు.‘ఇంద్ర’ సినిమా 24 జూలై 2002లో విడుదలైంది. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ లో సి.అశ్వనీదత్ నిర్మాణంలో తెరకెక్కింది. బి.గోపాల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు మణిశర్మ అద్భుతమైన సంగీతం అందించారు.
పైగా సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి ఇండస్ట్రీ హిట్స్ తో దూకుడు మీదున్న బి.గోపాల్ ఈ సినిమాను డైరెక్ట్ చేయడంతో ‘ఇంద్ర’ మూవీపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టే బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. చిరు కెరీర్ లో బెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.
ఇంద్ర సినిమా 229 సెంటర్స్ లో 50 రోజులు నడిచింది. అంతేకాదు 126 కేంద్రాల్లో 100 రోజులు నడిస్తే.. 32 కేంద్రాల్లో 175 రోజుల పరుగును పూర్త చేసుకుంది. విడుదలై 22 యేళ్లు గడుస్తున్న ఈ సినిమాను టీవీల్లో చూస్తే చూసే అభిమానులున్నారు.
ఇంద్ర సినిమా అప్పట్లోనే రూ. 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంతేకాదు టోటల్ రన్ లో ఈ సినిమా రూ. 32 కోట్ల షేర్ రాబట్టింది. తెలుగులో తొలి రూ. 30 కోట్ల షేర్ మార్క్ అందుకున్న తొలి సినిమాగా ‘ఇంద్ర’ రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు సినిమా బిజినెస్ పై 14 కోట్లకు లాభాలను నిర్మాతకు తీసుకొచ్చింది.