Gold River: బంగారం ప్రవహించే నది, ఆశ్చర్యంగా ఉందా..మనదేశంలోనే

దేశంలో 4 వందల కంటే తక్కువ చిన్న చిన్న నదులు ప్రవహిస్తున్నాయి. ఈ నదులకు ప్రత్యేకతలున్నాయి. కానీ ఇవాళ మనం చర్చించుకునే నది చాలా ప్రత్యేకమైంది. ఏకంగా ఈ నదిలో బంగారం ప్రవహిస్తుంటుంది. అవును నిజమే..నది నీళ్లలో బంగారం లభ్యమవుతుంటుంది. వందల ఏళ్ల తరువాత కూడా శాస్త్రవేత్తలు దీని వెనుక ఉన్న రహస్యాన్ని శోధించలేకపోయారు. ఆ విశేషాలు మీ కోసం

Gold River: దేశంలో 4 వందల కంటే తక్కువ చిన్న చిన్న నదులు ప్రవహిస్తున్నాయి. ఈ నదులకు ప్రత్యేకతలున్నాయి. కానీ ఇవాళ మనం చర్చించుకునే నది చాలా ప్రత్యేకమైంది. ఏకంగా ఈ నదిలో బంగారం ప్రవహిస్తుంటుంది. అవును నిజమే..నది నీళ్లలో బంగారం లభ్యమవుతుంటుంది. వందల ఏళ్ల తరువాత కూడా శాస్త్రవేత్తలు దీని వెనుక ఉన్న రహస్యాన్ని శోధించలేకపోయారు. ఆ విశేషాలు మీ కోసం

1 /5

నది ఇసుక నుంచి బంగారు రేణువుల్ని సేకరించడం రోజంతా కష్టపడితేనే సాధ్యమవుతుంది. ఇక్కడి ప్రజలు రోజంతా అదే పనిలో ఉంటారు. రోజంతా ఇసుకను జల్లెడపట్టి...బంగారు రేణువుల్ని సేకరిస్తారు. ఒక్కొక్క రేణువును 80-100 రూపాయలకు అమ్ముతుంటారు. 

2 /5

స్వర్ణరేఖ నది ఉపనది కర్కరీ నది. ఈ నది ఇసుకలో కూడా బంగారు రేణువులు లభిస్తాయి. అసలు స్వర్ణరేఖ నదిలో లభించే బంగారు రేణువులు కర్కరీ నది కారణంగానేనని కొంతమంది అంటుంటారు

3 /5

మీడియా నివేదికల ప్రకారం...ఈ నది కొండల్లోంచి ప్రవహిస్తూ వస్తుంది. అందుకే బంగారు కణాలు కొట్టుకొస్తుంటాయి. ఇందులో ఎంతవరకూ నిజముందో ఇప్పటి వరకూ తెలియదు

4 /5

ఈ నది జార్ఘండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశాలో ప్రవహిస్తుంది. జార్ఘండ్‌లోని రాంచీలో జన్మించే ఈ నది రాంచీ నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ నది ప్రత్యేకత ఏంటంటే..ఏ ఇతర నదిలోనూ కలవదు. నేరుగా బంగాళాఖాతంలో కలుస్తుంది.

5 /5

జార్ఘండ్‌లో ప్రవహించే స్వర్ణరేఖ నది ఇది. ఈ నదిలో నీటితో పాటు బంగారం ప్రవహిస్తుంటుంది. అందుకే స్వర్ణరేఖ నదిగా పిలుస్తారు. జార్ఘండ్‌లోని కొన్ని ప్రాంతాల్లోని గిరిజనులు ఉదయం నదిలో దిగి..సాయంత్రం వరకూ గాలిస్తారు. కొంత బంగారం సేకరిస్తారు. ఈ పనిని గిరిజనులకు చెందిన కొన్ని తరాలు చేస్తున్నాయి.