Hindu Beliefs: సూర్యాస్తమయం తరువాత చేయకూడని పనులివే..లేకపోతే

సూర్యాస్తమయం తరువాత కొన్ని పనులు చేయకూడదంటోంది శాస్త్రం. అలా చేస్తే జీవితంలో చాలా రకాల సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుందట. ఆరోగ్యానికి సంబంధించి కూడా సమస్యలు తలెత్తవచ్చట. అంతేకాదు..ఆర్ధిక ఇబ్బంందులు ఎదుర్కోవల్సి వస్తుంది. సూర్యాస్తమయం సమయంలో ఏయే పనులు చేయకూడదో పరిశీలిద్దాం

Hindu Beliefs: సూర్యాస్తమయం తరువాత కొన్ని పనులు చేయకూడదంటోంది శాస్త్రం. అలా చేస్తే జీవితంలో చాలా రకాల సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుందట. ఆరోగ్యానికి సంబంధించి కూడా సమస్యలు తలెత్తవచ్చట. అంతేకాదు..ఆర్ధిక ఇబ్బంందులు ఎదుర్కోవల్సి వస్తుంది. సూర్యాస్తమయం సమయంలో ఏయే పనులు చేయకూడదో పరిశీలిద్దాం

1 /5

మత విశ్వాసాల ప్రకారం సూర్యాస్తమయం తరువాత మొక్కలకు నీరు పోయడం లేదా మొక్కల్ని ముట్టుకోవడం లేదా మొక్కల్ని తెంపడం చేయకూడదు. సూర్యాస్తమయం తరువాత తులసి మొక్కల్ని అస్సలు ముట్టుకోకూడదు.

2 /5

శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తరువాత హెయిర్ కట్ లేదా నెయిల్స్ లేదా గెడ్డం తొలగించకూడదు. ఇలా చేస్తే అప్పులు పెరిగిపోతాయట

3 /5

గరుణ పురాణం ప్రకారం సూర్యాస్తమయం తరువాత అంతిమ సంస్కారం నిషిద్ధం. సూర్యాస్తమయం తరువాత అంతిమ సంస్కారాలు చేస్తే చనిపోయినవారికి పరలోకంలో కష్టాలెదురవుతాయి. అంతేకాకుండా వచ్చే జన్మలో అంగవైకల్యంతో పుడతారు. అందుకే సూర్యాస్తమయం తరువాత అంతిమ సంస్కారాలు చేయకూడదు.

4 /5

పురాణాల ప్రకారం సూర్యాస్తమయం తరువాత పెరుగు తినకూడదట. వాస్తవానికి సూర్యాస్తమయం తరువాత పెరుగు తినడం వల్ల ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదురౌతాయి. 

5 /5

కొంతమంది వేళాపాళా లేకుండా స్నానం చేస్తుంటారు. శాస్త్రాల ప్రకారం ఒకవేళ సూర్యాస్తమయం తరువాత స్నానం చేస్తే..నుదుట చందనం రాయకూడదు. సూర్యాస్తమయం తరువాత స్నానం చేస్తే జీవితంలో దౌర్భాగ్యముంటుందట