India vs Pakistan Asia Cup 2023: ఈ ఆటగాళ్ల మధ్య బిగ్‌ఫైట్.. చూసేందుకు మీరు రెడీనా..?

Ind Vs Pak Updates: టీమిండియా, పాకిస్థాన్ జట్లు ఆసియాకప్‌లో శుక్రవారం తలపడనున్నాయి. దాయదుల మధ్య సమరం అంటే మైదానంలో ఆటగాళ్లే కాదు.. అభిమానులు కూడా భావోద్వేగంతో ఉంటారు. రెండు జట్ల మధ్య బిగ్‌ ఫైట్‌ను చూసేందుకు రెడీగా ఉన్నారు. ఏ ఆటగాళ్ల మధ్య పోరు ఉంటుందో ఓసారి చూద్దాం..
 

  • Sep 01, 2023, 23:51 PM IST
1 /6

ఇటు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. అటు షాహీన్ అఫ్రిదితో మధ్య ఆసక్తికరంగా పోరు ఉండనుంది. లెఫ్టార్మ్ పేసర్‌కి గతంలో భారత బ్యాట్స్‌మెన్‌ను బాగా ఇబ్బందిపెట్టాడు.  

2 /6

ఇఫ్తికార్ అహ్మద్ Vs హార్దిక్ పాండ్యా: ఇఫ్తికార్ అహ్మద్, హార్దిక్ పాండ్యా ఇద్దరు లోయర్‌ ఆర్డర్‌లో కీ రోల్ ప్లేచేస్తారు. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో అహ్మద్ హాఫ్ సెంచరీ చేశాడు.  

3 /6

మహ్మద్ షమీ Vs ఇమామ్-ఉల్-హక్: పాకిస్థాన్ ఓపెనర్ ఇమామ్-ఉల్-హక్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. మహ్మద్ షమీ, ఇమామ్ ఉల్ హక్ మధ్య ఆసక్తికర పోరును చూడొచ్చు.   

4 /6

బాబర్ అజామ్ Vs జస్ప్రీత్ బుమ్రా: పాక్ కెప్టెన్ బాబర్ అజామ్, టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మధ్య బిగ్‌ఫైట్ ఉండనుంది. గాయం తరువాత బుమ్రా వన్డే జట్టులోకి తిరిగివచ్చాడు.   

5 /6

హరీస్ రౌఫ్ Vs ఇండియా మిడిల్ ఆర్డర్: భారత మిడిల్ ఆర్డర్‌కు హరీస్ రౌఫ్‌ మధ్య కీలక పోరు జరగనుంది.   

6 /6

శుభ్‌మాన్ గిల్ Vs నసీమ్ షా: టీమిండియా యంగ్ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్.. పాక్ యువ పేసర్ నసీమ్ షా మధ్య పోరు ఆసక్తికరంగా ఉండనుంది. పవర్‌ ప్లేలో పాక్ పేసర్లను గిల్ ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.