IND vs ENG: ఇండియా ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. కరోనా వైరస్ సంక్రమణ నేపధ్యంలో రెండు జట్లు విధిగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయిస్తోంది బీసీసీఐ. అటు కోవిడ్ వ్యాక్సిన్ అంశంపై ఇంగ్లండ్ క్రికెటర్ మొయీన్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు.
మొయీన్ అలీ పాకిస్తాన్ మూలాలకు చెందిన ఇంగ్లండ్ పౌరుడు. ఇంగ్లండ్ క్రికెట్ టీమ్‌తో పాటు శీలంక టూర్‌కు వచ్చినప్పుడు ఆయన కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆ తరువాత ఆయన 13 రోజులు క్వారెంటైన్‌లో గడిపారు.
బ్రిటన్‌లోని ముస్లిం లీడర్లు ప్రజలకు వ్యాక్సిన్ పట్ల నమ్మకం కల్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో మొయీన్ అలీ తన వంతు ప్రయత్నంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ వర్గంలో వ్యాక్సిన్ పట్ల సందేహాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇతర వ్యాక్సిన్ లాంటిదేనని మొయీన్ అలీ తెలిపారు. ఈ వ్యాక్సిన్ విషయంలో పుకార్లు వస్తున్నాయని కానీ దానిపై దృష్టి పెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేందుకు వ్యాక్సిన్ తప్పకుండా వేసుకోవాలని సూచించారు.
వర్చ్యువల్ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మొయీన్ అలీ వ్యాక్సిన్‌పై వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ గురించి తెలిసినవారితో తాను మాట్లాడానని..అందుకే ఈ మాటలు చెబుతున్నానన్నారు. తాను, తన కుటుంబం కూడా వ్యాక్సిన్ తీసుకుంటుందని చెప్పారు.
వ్యాక్సిన్ విషయంలో నెలకొన్న పుకార్లను నమ్మవద్దని..అందరూ విధిగా వ్యాక్సిన్ వేసుకోవాలని మొయీన్ అలీ సూచిస్తున్నారు. ఆయన వర్గానికి చెందినవారు చాలా తక్కువ మంది వ్యాక్సిన్ వేసుకోవడంతో ఈ వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే భయం కారణంగా ఆ వర్గం వ్యాక్సిన్‌కు దూరంగా ఉంది.