IT Refund: ఆర్ధిక సంవత్సరం 2022-23 ఆదాయంకై ఇన్కంటాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేందుకు జూలై 31 గడువు తేదీ. ఇప్పటికే రిటర్న్స్ దాఖలు చేసినవాళ్లుు రిఫండ్ కోసం ఎదురుచూస్తున్నారుు. రిఫండ్ ఎప్పటివరకూ వస్తుందని చాలామంది నిరీక్షిస్తున్నారు కూడా.
IT Refund: ఇప్పటి వరకూ కోట్లాదిమంది ట్యాక్స్ పేయర్లు ఇన్కంటాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేశారు. ఇంకా చాలామంది ఫైల్ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే రిటర్న్స్ దాఖలు చేసినవారిలో రిఫండ్ కోసం నిరీక్షిస్తున్న పరిస్థితి నెలకొంది. ఆ రిఫండ్ ఎప్పటిలోగా వస్తుందనేది తెలుసుకుందాం..
ట్యాక్స్ రిటర్న్ ప్రోసెసింగ్ సమయాన్ని గతంలో కంటే ఇప్పుడు చాలా వరకూ తగ్గించేసింది ఇన్కంటాక్స్ శాఖ. అందుకే రిటర్న్స్ ఫైల్ చేశాక సాధ్యమైనంత త్వరగా రిఫండ్ అందుతుంటుంది
నిర్ణీత గడువు కంటే ముందు కొద్దిరోజుల ముందు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం వల్ల ప్రోసెసింగ్కు ఎక్కువ సమయం పడుతుంది. అందుకే రిఫండ్ త్వరగా పొందాలంటే వెంటనే రిటర్న్స్ దాఖలు చేయడం మంచిది.
ఐటీ రిఫండ్ కచ్చితంగా ఎప్పుడు వస్తుందనేది అంచనా చెప్పలేమంటున్నారు ఐటీ నిపుణులు. 10-30 రోజుల కంటే ఎక్కువ సమయం పట్టవచ్చని తెలుస్తోంది. రిఫండ్ సరిగ్గా దాఖలు చేసుంటే కచ్చితంగా వస్తుంది.
ఇప్పటికే రిటర్న్స్ దాఖలు చేసినవాళ్లు రిఫండ్ కోసం ఇంకాస్త సమయం వేచి ఉండాల్సిందే. ఎందుకంటే ఇంకా రిటర్న్స్ ఫైల్ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. జూలై 31 వరకూ ఉంటుంది.
ఇన్కంటాక్స్ రిటర్న్స్ దాఖలు చేసి ఇంకా రిఫండ్ పొందనివారిలో ఆ రిఫండ్ ఎందుకు ఆలస్యమైందో తెలియదు. ఎప్పుడు వస్తుందో తెలియక నిరాశ చెందుతున్న పరిస్థితి ఉంది.