Immunity Booster Drink: ఈ టీతో 5 తీవ్ర వ్యాధులకు చెక్‌ పెట్టొచ్చు.. కాబట్టి దీనిని తప్పకుండా ట్రై చేయండి..

Immunity Booster Drink: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి  ఔషధ గుణాలు కలిగిన లెమన్ గ్రాస్‌ టీని తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

  • Nov 13, 2022, 17:45 PM IST

Immunity Booster Drink: అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి లెమన్ గ్రాస్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్ ఎ, సి, ఫోలేట్, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, జింక్, కాపర్, ఐరన్, పొటాషియం, ఫాస్పరస్, కాల్షియం, మాంగనీస్ అధిక పరిమాణంలో లభిస్తాయి. దీనిని వినియోగించి అన్ని అనారోగ్య సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు.

1 /5

ఈ లెమన్ గ్రాస్ టీలో ఉండే గుణాలు రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో మధుమేహాన్ని నియంత్రించే చాలా రకాల గుణాలుంటాయి. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్న వారు కూడా ఈ టీని తాగొచ్చు.

2 /5

లెమన్ గ్రాస్ హెర్బల్ టీ  ప్రతి రోజూ తాగితే శరీరం దృఢంగా అవ్వడమేకాకుండా సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి బరువు తగ్గడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నవారు తప్పకుండా ఈ టీని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.  

3 /5

హెర్బల్ టీ చేయడానికి లెమన్ గ్రాస్, నిమ్మకాయ, ఏలకులు, అల్లం, తులసి, ఏలకులు, తేనె పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ముందుగా రెండు కప్పుల నీటిని తీసుకుని అందులో వీటిని వేసి మరిగించాలి. ఆ తర్వాత ఈ వడబోసి తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

4 /5

లెమన్ గ్రాస్ హెర్బల్ టీ ప్రతి రోజూ తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో చలి కాలంలో వచ్చే సీజనల్‌ వ్యాధుల నుంచి సులభంగా అనారోగ్య సమస్యల నుంచి రక్షణ కలిపిస్తుంది. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడే వారు తప్పకుండా ఈ టీని తీసుకోవాల్సి ఉంటుంది.

5 /5

లెమన్ గ్రాస్‌లో ఉండే మూలకాలు  శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా దీనితో తయారు చేసిన టీని తాగితే శరీరం అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా అన్ని రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.