అమాయకమైన చూపుతో చిరునవ్వు చిందిస్తున్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

Sai Pallavi Childhood Photos: స్కూల్ డ్రస్సులో అమాయకమైన నవ్వుతో చిరునవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారి ఎంత అందంగా ఉందో కదా! అయితే ఈ చిన్నారి ఇప్పుడు సౌత్ ఇండియా చిత్రపరిశ్రమలో ఐకాన్ గా మారడం సహా తనదైన డ్యాన్స్ తో దేశవ్యాప్తంగా ఎంతోమంది ఫ్యాన్స్ ను దక్కించుకుంది. ఇంతకీ ఈ చిన్నారి ఎవరో తెలుసా?
 

  • Dec 15, 2021, 13:04 PM IST

Sai Pallavi Childhood Photos: స్కూల్ డ్రస్సులతో పాటు చిన్నతనంలోనే చీరలో ఆకట్టుకున్న ఈ పాప అటు తమిళ, మలయాళ సినిమాలతో పాటు తెలుగులోనూ వరుస చిత్రాలతో బిజీగా ఉంది. అటు నటనతో పాటు డ్యాన్స్ లతోనూ ఫ్యాన్స్ ను కట్టిపడేస్తుంది. అయితే ముద్దులొలికే చిన్నారి మరెవరో కాదు మలయాళ బ్యూటీ సాయి పల్లవి. 'మలర్' పాత్రలో ప్రేక్షకులకు పరిచయమై అతికొద్ది నాళ్లలోనే స్టార్ డమ్ ను సంపాదించుకుంది. 
 

1 /5

తమిళనాడు నీలగిరి కొండల్లోని కోటగిరి అనే ఊరిలో జన్మించింది సాయి పల్లవి. కోయంబత్తూర్​లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసింది  

2 /5

తబ్లిసీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదివింది. ఆ తర్వాత సినిమా రంగాన్ని కెరీర్​గా ఎంచుకుంది  

3 /5

'కస్తూరిమన్' (2003) అనే చిత్రంలో బాలనటిగా కనిపించింది  

4 /5

వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'ఫిదా' చిత్రంతో టాలీవుడ్​లో అరంగేట్రం చేసింది.  

5 /5

టాలీవుడ్​లో సాయి పల్లవి నటించిన 'లవ్​స్టోరి', 'విరాట పర్వం' విడుదలకు సిద్ధంగా ఉండగా, 'శ్యామ్ సింగరాయ్​' షూటింగ్ దశలో ఉంది.