Hamsa Yog Effect: 104 ఏళ్ల తర్వాత అరుదైన హంస యోగం.. కొండంత డబ్బు ఈ రాశుల వారి సొంతం.. మీరున్నారా..?

Astrology Effect: హంసయోగ ప్రభావం వల్ల కొన్నిరాశుల వారి జీవితంలో ఆకస్మిక ధనలాభానికి సూచనలు కన్పిస్తున్నాయి. అందుకే ఈ సమయంలో వీరు చేసే ప్రతి కార్యకార్యక్రమం దిగ్విజయంగా పూర్తవుతుందని పండితులు  చెబుతున్నారు.
 

1 /6

జ్యోతిష్య పండితుల ప్రకారం కొన్ని యోగాలు మనిషి జీవితంలోని ఉన్నతికి కారణమౌతాయి. దీనివల్ల అనుకొని విధంగా రాబడి పెరుగుతుంది. కోట్ల ఆస్తులు వీరి సొంతమవుతాయి.  ముఖ్యంగా గజకేసరి యోగం, త్రిగ్రహి యోగం, ధనయోగం, మాళవ్య యోగం వంటివి ఎన్నో ధనలాభానికి కారణమౌతాయి. వీటితో పాటు.. హంస యోగం కూడా మనిషిని ఉన్నత స్థానానికి తీసుకొని వెళ్తుందని పండితులు చెబుతున్నారు.

2 /6

హంస యోగం అనేది అత్యంత అరుదుగా ఏర్పడే యోగం. హంస సరస్వతి అమ్మవారి వాహానంగా చెబుతుంటారు. అదే విధంగా ఈ యోగం.. దేవగురువైన బృహస్పతి ఆయా రాశులలో వారి జన్మరాశిలో.. మరల తన సొంత స్థానంలో.. వచ్చినప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం అనేది సెప్టెంబర్ 27 ఏర్పడుతుంది. దీని వల్ల కొన్ని రాశుల వారికి కోటీశ్వరులు కాబోతున్నారు. ఆ రాశులేంటో ఇప్పుడు చూద్దాం.

3 /6

మేషం.. ఈ రాశివారికి ముఖ్యంగా చేస్తున్న పనుల్లో విజయాలు లభిస్తాయి. ఇప్పటి వరకు రాబడిలేదనుకొని భావించే వారు కోట్లాదిగా లాబాలను గడిస్తారు. ఉన్న ఊరిలో మీ పలుకుబడి పెరుగుతుంది. కొత్త ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఆగిపోయిన మీ పనులన్ని పూర్తవుతాయి.

4 /6

తులరాశి.. ఈ రాశి వారికి సోదరులో ఏర్పడిన వివాదాలు సమసిపోతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పెద్దల నుంచి మీకు ఆస్తులు సంక్రమిస్తాయి. కోర్టుకేసులలో విజయాలు సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు.  

5 /6

 ధనస్సు రాశి.. వీరికి ముఖ్యంగా చేపట్టిన పనులను సకాలంలో పూర్తవుతాయి. పెళ్లి సంబంధాలు కుదురుతాయి. మీరు కోరుకున్న చోట ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. విదేశీయానాని కూడా అవకాశం కన్పిస్తుంది.  

6 /6

మీనం.. ఈ హాంసయోగం ప్రభావం వల్ల వీరికి ఆకస్మిత ధనలాభం కలుగుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మీకుటుంబంతో కలిసి దూర ప్రాంతాలకు వెళ్లి దైవదర్శనాలు చేసుకుంటారు. మీ వల్ల లాభం పొంది ముఖం చాటేసిన వారి మరల మీ దగ్గరకువస్తారు. లాటరీలు తగిలే అవకాశం కూడా ఉంది.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)