రాత్రి పూట నిద్రపోవడానికి ముందు కొన్ని రకాల హెల్తీ డ్రింక్స్ తాగడం వల్ల హాయిగా నిద్ర పట్టడంతో పాటు బరువు కూడా తగ్గే అవకాశం ఉంటుంది.
బెడ్ టైం డ్రింక్స్ తాగడం వల్ల శరీరంలో ఉన్న అధిక కేలరీలను కరిగించి కొవ్వును తగ్గించుకునే అవకాశం ఉంది. మరి ఆ హెల్తీ డ్రింక్స్ ఎంటో మీరే చూసేయండి.
కొవ్వును కరిగించే పసుపు పాలు ( Turmeric milk helps to loss weight ) పసుపులో పీచు పదార్థం ఉంటుంది, ఇది బరువు పెరగకుండా నిరోధిస్తుంది అలాగే శరీరంలో కొవ్వు స్థాయిని తగ్గిస్తుంది. రాత్రి పడుకునేటప్పుడు పాలలో పసుపు కలుపుకొని తాగడం వల్ల మరింత ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. హాయిగా నిద్ర పడుతుంది.
కెఫీర్ డ్రింక్‌తో బరువు తగ్గొచ్చు ( Drink Kefir milk to loss weight ) కేఫీర్ అనేది డైరీ మిల్క్ నుండి తయారైన పులియబెట్టిన డ్రింక్. ప్రోబయోటిక్ బ్యాక్టీరియా అధికంగా ఉంటుంది. ఇది గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, శరీర బరువును తగ్గిస్తుంది.
కలబంద రసంతో అదనపు కొవ్వును కరిగించుకోవచ్చు ( Aloe vera juice ) బెడ్ టైమ్‌లో కలబంద రసం తాగడం వల్ల సహజంగా అదనపు కొవ్వును కరిగించుకోవచ్చు. ఇందులో విటమిన్ బి అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో నిల్వ ఉన్న కొవ్వును శక్తిగా మార్చి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
మెంతి గింజలు నానపెట్టిన నీరు ( Soaked fenugreek water ) మెంతి గింజలు లేదా మెంతులు జీవక్రియను పెంచుతాయి, జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తాయి. ఇది ఆకలిని తగ్గించడంలో కూడా చాలా ప్రభావవంతంగా పనిచేసి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
బరువు తగ్గడానికి ఉపయోగపడే ( Cinnamon tea to loss weight ) బెడ్ టైమ్‌లో దాల్చిన చెక్క టీ తాగడం వల్ల జీవక్రియను మెరుగు పరుస్తుంది. అంతేకాకుండా అధిక బరువు పెరగడాన్ని కూడా నివారిస్తుంది.
డ్రింకింగ్ వాటర్ ఎక్కువగా తీసుకోవాలి ( Water aids in weight loss ) ఎలాంటి కేలరీలు లేని డ్రింక్ అంటే నీరు. నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల డీహైడ్రేట్ అవ్వకుండా ఉంచుతుంది. అంతేకాకుండా ఎక్కువగా నీళ్ళు తీసుకోవడం వల్ల అధిక కొవ్వు ఉన్న పదార్ధాలను తీసుకోలేరు తద్వార బరువు తగ్గొచ్చు.
కాల్షియం, పొటాషియం ఫ్లేవనాయిడ్స్‌తో ఉండే చమోమిలే టీ ( Chamomile tea ) చమోమిలే టీ కాల్షియం, పొటాషియం ఫ్లేవనాయిడ్స్‌తో నిండి ఉంటుంది. ఇది కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది. రాత్రి నిద్రపొయే ముందు ఒక కప్పు వేడి చమోమిలే టీ మనస్సును తేలికపరిచి, మంచి నిద్రకు సహకరిస్తుంది.