బాప్ రే.. షేక్ హసీనాకు అన్ని వేల కోట్ల ఆస్తులా..?.. ఆమె వార్షిక వేతనం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..

Sheikh Hasina Proporties: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్ లో ఆశ్రయం పొందారు. మరోవైపు ఆమె అధికార నివాసంలో ఆందోళనకారులు ప్రవేశించి అందినకాడికి దోచుకుని పారిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం షేక్ హసీనా ఆస్తులకు సంబంధించిన వార్త సామాజిక మాధ్యమంలో ట్రెండింగ్ గా మారింది.
 

1 /7

బంగ్లాదేశ్ లో ప్రస్తుతం తీవ్ర అనిశ్చితి కొనసాగుతుంది. ఇప్పటికే బంగ్లాదేశ్ అధికార నివాసం గణభబన్ లో వేలాదిగా ఆందోళన కారులు ప్రవేశించారు. అక్కడి ఆహార పదార్థాలను తింటూ విచ్చలవిడిగా ప్రవర్తించారు. అంతేకాకుడా.. అక్కడి ఫర్నీచర్ సామాగ్రిని చోరీ చేశారు. చివరకు షేక్ హసీనా చీరలను సైతం ఆందోళనకారులు దోచుకుని పోయారు. 

2 /7

ఇప్పటికి కూడా బంగ్లాదేశ్ లో పరిస్థితులు మాత్రం అదుపులోకి రాలేదు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం షేక్ హసీనా మాత్రం భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు. లండన్ నుంచి ఆదేశాలు రాగానే  యూకేకు శరణార్థిగా వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

3 /7

మరోవైపు.. హసీనా సోదరి రెహానా యూకే పౌరురాలు. ఆమె కూతురు తులీప్ సిద్దీఖీ ప్రస్తుతం లేబర్ పార్టీ తరపున పార్లమెంట్ మెంబర్ గా ఉన్నారు. ఈ క్రమంలోనే బ్రిటన్ కు షేక్ హసీనా అభ్యర్థించినట్లు తెలుస్తోంది. 

4 /7

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అవామీలీగ్ నేత షేక్ హసీనా ఆస్తుల గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హసీనా నివాసంలో పనిచేసిన జహంగీర్ ఆలం అనే సహాయకుడిపేరుమీద.. రూ. 284 కోట్లు  ఆస్తులున్నాయని వార్త సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. అతను ఇప్పుడు అమెరికాలో ఉంటున్నాడంట.

5 /7

దీంతో షేక్ హసీనా ఎన్నికోట్లుఉంటాయని అందరు షాక్ కు గురౌతున్నారు. ఈ నేపథ్యంలో.. ఇటీవల బంగ్లాలో జరిగిన సార్వత్రిక ఎన్నికల వేళ షేక్ హసీనా ఒక అఫిడవిట్ ను సబ్మిట్ చేసింది. అందులో.. ఆస్తులు మొత్తం విలువ.. రూ. 4.36 కోట్లుగా ఆమె పేర్కొంది.  

6 /7

అంతేకాకుండా.. ఆరు ఎకరాల వ్యవసాయ భూమి, చేపల పెంపకం తన ఆదాయంలో భాగమని కూడా ఆమె చూపించింది. తన వద్ద గిఫ్ట్ గా వచ్చిన అతి పెద్ద కారు ఉందని కూడా చెప్పింది. ఆమెకు పీఎంగా ఏడాదికి గాను.. రూ. 9.9  లక్షల  వేతనం అందుకున్నట్లు తెలుస్తోంది.  అంటే నెలకు రూ. 86 వేలు అన్నమాట.  

7 /7

 ఆదాయపు పన్ను రిటర్స్ మొత్తం.. రూ. 1.91 కోట్లు, 75 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్లు తెలుస్తోంది. షేక్ హసీనాకు 1968 లో భౌతిక శాస్త్రవేత్త, బంగ్లా అటామిక్ ఎనర్జీ కమిషన్ మాజీ చైర్మన్ వాజెద్  మియాను పెళ్లి చేసుకున్నారు. మియా 2009 లో మరణించాడు. హసీనా,మియాలకు ఇద్దరు సంతానం. కొడుకు.. సజిద్ వాజెద్, సైమా వాజెద్ కూతరు.  సజిద్.. బంగ్లాలో వ్యాపారవేత్త. ప్రధానికి ఇన్ఫఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీనకి సలహాదారుగా పనిచేస్తున్నాడు.