Honda 100CC Bike: హోండా నుంచి 100CC బైక్.. ఎంట్రీ లెవెల్లోనే టాప్ మోడల్ ఫీచర్స్ ?

Honda 100CC Bike: హోండా నుంచి 100CC బైక్ వచ్చేస్తోంది. వచ్చే నెలలో ముంబైలో జరగనున్న ఓ ఈవెంట్ లో హోండా 100CC బైక్ లాంచ్ కానుంది. అందరికీ అందుబాటులో ఉండేలా తక్కువ ధరలో ఒక బైక్ లాంచ్ చేయాలని హోండా కంపెనీ ఎప్పటి నుంచో భావిస్తోంది. ఇంజన్ కెపాసిటి పరంగా ఈ బైక్ పైసా వసూల్ బైక్ అని కంపెనీ చెబుతోంది.

  • Feb 28, 2023, 00:05 AM IST

Honda 100CC Bike: హోండా 100CC బైక్ గురించి సోమవారం టీజర్ లాంచ్ చేసిన హోండా కంపెనీ.. బైక్‌కి సంబంధించిన చాలా వివరాలను బహిర్గతం చేయకుండా గోప్యంగా ఉంచింది. హోండా 100 CC బైక్ కోసం వెయిట్ చేస్తున్న వారిని మరింత సస్పెన్స్‌లో పెడుతూ డిజైన్ సహా అనేక వివరాలను హోండా కంపెనీ రివీల్ చేయకుండా సీక్రసీ మెయింటెన్ చేసింది.

1 /4

హోండా 100CC బైక్ లాంచింగ్ డేట్ : ముంబైలో మార్చి 15న జరగనున్న ఓ ఈవెంట్‌లో హోండా 100CC బైక్‌ని లాంచ్ చేయనున్నట్టు హోండా మోటార్స్ కంపెనీ ప్రకటించింది.

2 /4

హోండా 100CC బైక్ డిజైన్ :  హోండా కంపెనీ నుంచి గతంలో వచ్చిన హోండా షైన్ బైక్ తరహాలోనే హోండా 100CC బైక్ డిజైన్ కూడా ఉండనుందని తెలుస్తోంది. అయితే, కొత్తగా డిజిటల్ ఎక్విప్‌మెంట్‌ని అమర్చినట్టు సమాచారం. ఎంట్రీ లెవెల్లో ఇతర ఏ బైకులకు లేని విధంగా డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్స్ అమర్చినట్టు వినికిడి.

3 /4

హోండా 100CC బైక్ పేరు :  గతంలో పాపులర్ అయిన హోండా షైన్ సిరీస్ కిందే ఈ బైక్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని.. ఇంకా చెప్పాలంటే హోండా షైన్ 100 గా ఈ బైక్ పేరు ఉండే అవకాశాలు ఉన్నాయని మీడియా రిపోర్ట్స్ చెబుతున్నాయి.

4 /4

హోండా 100CC బైక్ ఎవరికి పోటీ ? : హీరో స్ప్లెండర్, బజాజ్ ప్లాటిన వంటి బైక్స్ కి హోండా 100CC బైక్ గట్టిగా పోటీ ఇచ్చే అవకాశం ఉందని ఆటోమొబైల్ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. హోండా 100CC బైక్ టీజర్ పై ఓ లుక్కేయండి.. ఎలాంటి అంచనాలతో కంపెనీ ఈ బైక్ తయారు చేసింది అనే విషయం మీకే అర్థమైపోతుంది. Aa rahi hai Honda ki Sau, ye zyada chalegi, aur zyada tikegi! Get ready to bring home the trust of Honda. Stay tuned! For more information, please give us a missed call on +919311340947 or visit our website.#Honda #PowerOfDreams pic.twitter.com/vvmZoCF5xM — Honda 2 Wheelers (@honda2wheelerin) February 27, 2023   ఇది కూడా చదవండి : Royal Enfield Hunter 350: ఈ బైక్‌ని ఎగబడి మరీ కొంటున్న జనం.. 6 నెలల్లో లక్షకుపైగా బైక్స్ అమ్మకం ఇది కూడా చదవండి : Bajaj Dominar 400 Price: ఈ బజాజ్ బైక్‌పై రూ. 25 వేల భారీ తగ్గింపు.. సూపర్ కదా