Home Remedy For Constipation: 15 నిమిషాల్లో మలబద్ధకం, పొట్ట సమస్యలను తగ్గించే అద్భుత చిట్కాలు..


Acidity Constipation Home Remedies: ప్రస్తుతం చాలా మంది పొట్ట సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఈ కింది చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 
 

Acidity Constipation Home Remedies: వానా కాలంలో తిన కూడాని ఆహారాలు తినడం వల్ల చాలా మంది పొట్ట సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా చాలా మంది అపానవాయువు, కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలతో బాధపడతారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి..లేకపోతే ఈ సమస్యలు మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
 

1 /5

మలబద్ధకం, పొట్ట సమస్యలతో బాధపడేవారు తప్పుకుండా నెయ్యితో పాటు రాక్‌ సాల్ట్‌ను వినియోగించాల్సి ఉంటుంది. క్రమం తప్పకుండా దీనిని వినియోగించడం వల్ల చాలా రకాల పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

2 /5

తరచుగా గ్యాస్‌ సమస్యలతో బాధపడేవారు కూడా ఒక చిన్న గ్లాస్‌లో నెయ్యితో పాటు రాక్‌ సాల్ట్‌ను వేసి తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా శరీరం కూడా యాక్టివ్‌గా కూడా మారుతుంది. రాత్రి భోజనం చేసిన గంట తర్వాత ఈ డ్రింక్‌ని తాగాల్సి ఉంటుంది.

3 /5

వేడి నీటిలో అర చెంచా రాక్ సాల్ట్‌ను వేసుకుని తాగడం వల్ల కూడా సులభంగా పొట్ట సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.  

4 /5

పుల్లని త్రేనుపు, ఎసిడిటీ సమస్యలతో బాధపడున్నవారు ఒక చిన్న గ్లాసులో సగం పెరుగు తీసుకుని.. అందులో రాళ్ల ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి వేసి మిక్స్‌ చేసుకుని తాగితే సులభంగా ఈ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

5 /5

రాళ్ల ఉప్పు కలిపిన పెరుగు తాగడం వల్ల కూడా జీర్ణక్రియ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా మలబద్ధకం, పొట్ట ఉబ్బరం నుంచి కూడా సులభంగా విముక్తి కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.