Highest FD Interest Rates: ఈ బ్యాంకులో బంపర్ ఆఫర్.. ఎఫ్డీపై ఏకంగా 9.5 శాతం వడ్డీ


Highest FD Interest Rates : దేశంలో ఉన్న  చిన్న ఫైనాన్స్ బ్యాంకులు.. సాధారణ వాణిజ్య బ్యాంకులతో పోలిస్తే.. సీనియర్ సిటిజన్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీని అందిస్తున్నాయి. 6 వేర్వేరు చిన్న ఫైనాన్స్ బ్యాంకుల ద్వారా సీనియర్ సిటిజన్‌లకు ఎఫ్డీలపై అందించే అత్యధిక వడ్డీ ప్లాన్‌ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 
 

1 /9

Highest FD Interest Rates for Senior Citizens: చాలా మంది రిటైర్మెంట్ తర్వాత ఎవరిమీద ఆధారపడకుండా ఉండేందుకు కొంతడబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుంటారు. అలా చేసిన డబ్బు ద్వారా వచ్చే వడ్డీతో కాలం వెళ్లదీస్తారు. ఇలాంటి వారికి కోసం దేశంలోనే ఎన్నో బ్యాంకులు అత్యధిక వడ్డీరేటును అందిస్తున్నాయి. మరీ ముఖ్యంగా దేశంలోనే అతిపెద్ద  ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  7.75శాతం వడ్డీరేటును అందిస్తుంది. ఆ తర్వాత హెచ్డీఎఫ్సీ ఐసీఐసీఐ, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషన్ బ్యాంక్ వంటివి వడ్డీని చెల్లిస్తున్నాయి. అయితే సీనియర్ సిటిజన్లకు అత్యధికంగా 9.5శాతం వడ్డీని అందిస్తున్న బ్యాంకులు ఏవో తెలుసా.   

2 /9

ఈ బ్యాంకులు సాధారణ వాణిజ్య బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీని చెల్లిస్తున్నాయి.  దేశంలోని అన్ని చిన్న ఫైనాన్స్ బ్యాంకులు సాధారణ వాణిజ్య బ్యాంకులతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీని అందిస్తున్నాయి. 6 వేర్వేరు చిన్న ఫైనాన్స్ బ్యాంకుల ద్వారా సీనియర్ సిటిజన్‌లకు FDపై అందించే అత్యధిక వడ్డీ ప్లాన్‌ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.  వీటిలో గరిష్ట వడ్డీ 9.5 శాతం, కనిష్ట వడ్డీ 8.75 శాతం వరకు వడ్డీని అందిస్తున్నాయి.  

3 /9

జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 365 రోజులు, 730 రోజులు, 1095 రోజుల కాలవ్యవధితో FDలపై సీనియర్ సిటిజన్‌లకు 8.75% వడ్డీని అందిస్తోంది.  

4 /9

ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 444 రోజుల కాలవ్యవధితో FDపై సీనియర్ సిటిజన్‌లకు 9.00% వడ్డీని అందిస్తోంది.  

5 /9

ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 730 రోజుల నుండి 1095 రోజులు, 1500 రోజుల కాలవ్యవధితో FDలపై సీనియర్ సిటిజన్‌లకు 9.10% వడ్డీని అందిస్తోంది.  

6 /9

సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల వరకు FD పై సీనియర్ సిటిజన్లకు 9.10% వడ్డీని అందిస్తోంది.  

7 /9

యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 1001 రోజుల కాలవ్యవధితో FDపై సీనియర్ సిటిజన్లకు 9.50% వడ్డీని అందిస్తోంది.  

8 /9

ఈ బ్యాంక్ 546 రోజుల నుండి 1111 రోజుల కాలవ్యవధితో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్‌లకు 9.50% వడ్డీని అందిస్తోంది.

9 /9

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. మీ పెట్టుబడులు, డిపాజిట్లపై జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. మీ డిపాజిట్లు, పెట్టుబడులపై సంబంధిత రంగంలోని నిపుణుల తీసుకుంటే మంచిది.