Beer and Foods: వేసవి కావడంతో మద్యం షాపుల వద్ద రద్దీ పెరిగిపోతోంది. ముఖ్యంగా బీరుకు భారీ డిమాండ్ పెరిగింది. దాహం తీర్చేందుకు చల్లని బీర్ కోసం మందుషాపుల వద్ద నిరీక్షిస్తున్నారు. బీర్ లేకుండా ఏ పార్టీ ఉండదు. బీరు వల్ల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అదే సమయంలో బీర్ తాగేటప్పుడు ఏవి తినాలి ఏవి తినకూడదనేది ఆలోచించుకోవాలి.
Beer and Foods: అదే సమయంలో బీరు తాగుతూ ఏ మాత్రం ముందూ వెనుకా చూడకుంటా ఇష్టమొచ్చినవి తినేస్తుంటారు. బీరు సేవించినప్పుడు కొన్ని పదార్ధాలు అస్సలు తినకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు. బీరు తాగిన సమయంలో కొన్ని పదార్ధాలు తినడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదంట. లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదంటున్నారు.
బీరు తాగేటప్పుడు స్వీట్స్ తినడం కూడా మంచి అలవాటు కాదు. తక్షణం ఈ అలవాటు మానుకోవాలి.
బీర్ తాగేటప్పుడు మసాలా పదార్ధాలు తినడం చాలా మందికి ఎప్పట్నించో ఉన్న అలవాటు. ఈ అలవాటు ఆరోగ్యానికి నష్టం కల్గిస్తుంది. కడుపు సంబంధిత సమస్యలు ఉత్పన్నమౌతాయి.
బీర్ తాగేటప్పుడు వేరుశెనగ గింజలు తినడం ఓ అలవాటు. ఇది ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా డీహైడ్రేషన్ సమస్య తలెత్తవచ్చు.
బీర్ తాగేటప్పుడు చాలామందికి ఫ్రెంచ్ ఫ్రైస్ తినడం అలవాటు. చాలా ఇష్టంగా తింటారు కూడా. కానీ ఈ అలవాట్లు మంచిది కాదు. దీనివల్ల జీర్ణ సంబంధిత సమస్య రావచ్చు.
బీరు తాగిన 2 గంటలక వరకూ బ్రెడ్ లేదా బ్రెడ్‌తో తయారయ్యే ఏ విధమైన పదార్ధాలు తినకూడదు. ఎందుకంటే జీర్ణక్రియపై ప్రభావం పడే అవకాశముంది. అందుకే బీర్ తాగినప్పుడు బ్రెడ్‌కు దూరంగా ఉండాల్సిందే.