Hemoglobin: మీ డైట్‌లో ఈ పదార్ధాలు చేర్చుకుంటే హిమోగ్లోబిన్ లోపం ఇట్టే దూరం

మనిషి శరీరంలో రక్తం కీలకమైన భూమిక పోషిస్తుంది. రక్తం ఆరోగ్యం అనేది అందులో ఉండే హిమోగ్లోబిన్‌పై ఆధారపడి ఉంటుంది. హిమోగ్లోబిన్ సరైన మోతాదులో ఉంటేనే రెడ్ బ్లడ్ సెల్స్ నిర్మాణమౌతాయి. శరీరమంతా ఆక్సిజన్ సరఫరాకు ఉపయోగపడేవి ఇవే. హిమోగ్లోబిన్ తక్కువైతే అందుకే చాలా సమస్యలు వెంటాడుతాయి. మరి హిమోగ్లోబిన్ కొరతను దూరం చేసేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం..

Hemoglobin: మనిషి శరీరంలో రక్తం కీలకమైన భూమిక పోషిస్తుంది. రక్తం ఆరోగ్యం అనేది అందులో ఉండే హిమోగ్లోబిన్‌పై ఆధారపడి ఉంటుంది. హిమోగ్లోబిన్ సరైన మోతాదులో ఉంటేనే రెడ్ బ్లడ్ సెల్స్ నిర్మాణమౌతాయి. శరీరమంతా ఆక్సిజన్ సరఫరాకు ఉపయోగపడేవి ఇవే. హిమోగ్లోబిన్ తక్కువైతే అందుకే చాలా సమస్యలు వెంటాడుతాయి. మరి హిమోగ్లోబిన్ కొరతను దూరం చేసేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం..

1 /5

పంచదారతో పోల్చితే బెల్లం ఆరోగ్యానికి మంచిది. బెల్లంలో ఐరన్ పెద్దమొత్తంలో ఉంటుంది. హిమోగ్లోబిన్ కొరతను దూరం చేసేందుకు దోహదపడుతుంది.

2 /5

యాపిల్ ఆరోగ్య ఔషధి. రోజుకో యాపిల్ అనేది వ్యాధుల్ని దూరం చేస్తుందంటారు. యాపిల్ రోజూ తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ సమస్య ఉండదు.

3 /5

ఉసిరి శరీరానికి, ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. హిమోగ్లోబిన్ కొరతను తీర్చేందుకు  ఉసిరి అద్బుతంగా పనిచేస్తుంది. రోజూ లేదా వారానికి కనీసం 4-5 సార్లు ఉసిరి తీసుకోవడం మంచిది.

4 /5

ఇక పసుపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్బుతమైన ఆయుర్వేద ఔషధమిది. వివిధ రకాల అనారోగ్యాల్ని దూరం చేసేందుకు దోహదపడుతుంది. ముఖ్యంగా హిమోగ్లోబిన్ కొరతను దూరం చేస్తుంది. దీనికోసం చిటికెడు పసుపును నీళ్లలో కలుపుకుని తాగుతుండాలి.

5 /5

పచ్చి కూరగాయలు లేదా పాలకూరలో హిమోగ్లోబిన్ అద్భుతంగా పనిచేస్తుంది. పాలకూరను రోజువారీ డైట్‌లో భాగంగా చేసుకోవాలి.