Diabetes Prevention Tips: ఈ 5 అలవాట్లు అలవర్చుకుంటే డయాబెటిస్ ముప్పు ఉండదిక

Diabetes Prevention Tips: మధుమేహం అత్యంత ప్రమాదకర వ్యాధి. నియంత్రణ ఎంత సులభమో నిర్లక్ష్యం వహిస్తే అంతే ప్రమాదకరంగా మారుతుంది. మధుమేహం నియంత్రణ దాదాపుగా జీవనశైలి, ఆహారపు అలవాట్లపైనే ఆధారపడి ఉంటుంది. రోజూ ఈ 5 అలవాట్లు అలవర్చుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయంటున్నారు డైటిషియన్లు.

Diabetes Prevention Tips: డయాబెటిస్ అనేది ఒకసారి సోకితే ఇక ఆ మనిషికి అన్నీ ఇబ్బందులే. తీసుకునే ప్రతి ఆహారాన్ని ఆచి తూచి తినాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకే డయాబెటిస్ వ్యాధి భవిష్యత్తులో సోకకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవచ్చు. టైప్ 2 డయాబెటిస్ రాకుండా కాపాడుకోవచ్చు.

1 /5

బరువు తగ్గించడం మధుమేహం రాకుండా ఉండాలంటే ముందుగా స్థూలకాయం లేదా అధిక బరువుకు చెక్ పెట్టాలి. స్థూలకాయం మధుమేహానికి దారితీసే ప్రధాన కారణం. దీనికోసం హెల్తీ డైట్, రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ ఉండాలి.

2 /5

నీళ్లు తాగడం శరీరాన్ని ఎప్పుడై హైడ్రేట్గా ఉంచేందుకు తగిన నీళ్లు తాగుతుండాలి. వేసవిలో అయితే మరింత ఎక్కువగా తీసుకోవాలి. సోడా, ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూస్‌కు దూరంగా ఉండాలి. లేకపోతే టైప్ 2 డయాబెటిస్ ముప్పును ఎదుర్కోవల్సి వస్తుంది.

3 /5

ధూమపానం సిగరెట్, బీడీ, హుక్కా, గంజాయి వంటివి ఆరోగ్యానికి ప్రమాదకరం. వీటివల్ల శ్వాసకోశ వ్యవస్థపై ప్రబావం పడుతుంది. అదే సమయంలో డయాబెటిస్ ముప్పును పెంచుతుంది. అందుకే ఈ అలవాట్లకు దూరంగా ఉండాలి.

4 /5

వ్యాయామం రోజూ వ్యాయామం చేస్తుంటే డయాబెటిస్ ముప్పు చాలా వరకూ తగ్గుతుంది. ఎందుకంటే వ్యాయామం కారణంగా అదనంగా ఉండే కొవ్వు కరుగుతుంది. దాంతో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.

5 /5

కార్బోహైడ్రేట్ ఫుడ్ తగ్గించడం కార్బోహైడ్రేట్లు కూడా శరీరానికి అవసరమే. అయితే ఇవి మోతాదు మించకూడదు. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరం వాటిని చిన్న చిన్న షుగర్ కణాలుగా మార్చి రక్తంలో కలిపేస్తుంది. దాంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి.