Food Precautions: రోజూ పరగడుపున ఈ పదార్ధాలు అస్సలు ముట్టకూడదు

మనిషి ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రధానంగా పాటించాల్సిన సూత్రం నెవర్ స్కిప్ బ్రేక్‌ఫాస్ట్. శరీరాన్ని ఫిట్ అండ్ హెల్తీగా ఉంచేందుకు ఇది అవసరం. అదే సమయంలో మీరు తీసుకునే ఆహారం ఎప్పుడూ పోషకాలతో నిండి ఉండేదిగా ఉండాలి. కానీ కొన్ని రకాల ఆహార పదార్ధాలు మాత్రం ఉదయం పరగడుపున అస్సలు తీసుకోకూడదు. అవేంటో తెలుసుకుందాం..

Food Precautions: మనిషి ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రధానంగా పాటించాల్సిన సూత్రం నెవర్ స్కిప్ బ్రేక్‌ఫాస్ట్. శరీరాన్ని ఫిట్ అండ్ హెల్తీగా ఉంచేందుకు ఇది అవసరం. అదే సమయంలో మీరు తీసుకునే ఆహారం ఎప్పుడూ పోషకాలతో నిండి ఉండేదిగా ఉండాలి. కానీ కొన్ని రకాల ఆహార పదార్ధాలు మాత్రం ఉదయం పరగడుపున అస్సలు తీసుకోకూడదు. అవేంటో తెలుసుకుందాం..

1 /5

షుగర్ పదార్ధాలు రోజూ పరగడుపున పంచదారతో తయారైన పదార్ధాలు తీసుకునే అలవాటుంటే మానేయాలి. ఉత్తరాది ప్రజలకు ఈ అలవాటు ఎక్కువ. ఇది ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. మధుమేహం వంటి వ్యాధులు త్వరగా సోకుతాయి. 

2 /5

టీ- కాఫీ ఉదయం లేవగానే చాలామంది బెడ్ కాఫీ లేదా టీ తాగడం చేస్తుంటారు. దేశంలో 70-80 శాతం మందికి ఇది అలవాటు. కానీ పరగడుపున ఇలా చేయడం వల్ల శరీరంలో విషం పుడుతుంది. ఎసిడిటీ సమస్య తలెత్తుతుంది. రోజంతా చికాకు ఉంటుంది. 

3 /5

మసాలా పదార్ధాలు చాలామంది రోజూ ఉదయం మసాలా లేదా స్పైసీ పదార్ధాలతో ప్రారంభిస్తుంటారు. ఇది అస్సలు మంచి పద్ధతి కాదు. దీనివల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. జీర్ణక్రియ కూడా పాడవుతుంది. పుల్లటి తేన్పులు, కడుపు నొప్పి, ఛాతీలో మంట వంటి సమస్యలు ఏర్పడతాయి. 

4 /5

ప్యాకెట్ జ్యూస్ చాలామంది ఆధునిక బిజీ లైఫ్ కారణంగా మార్కెట్‌లో లభించే ప్యాకెట్ ఫుడ్స్, ప్యాకెట్ జ్యూస్‌పై ఆధారపడుతుంటారు. ఉదయం వేళ పరగడుపున ఇది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. దీనివల్ల స్థూలకాయం, డయాబెటిస్ వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. 

5 /5

సిట్రస్ ఫ్రూట్స్ ఉదయం వేళ బ్రేక్‌ఫాస్ట్ ఎప్పుుడూ మిస్ చేయకూడదు. రోజూ బ్రేక్‌ఫాస్ట్ చేయడం వల్ల చాలా రకాల వ్యాధులు దూరమౌతాయి. ఉదయం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ శరీరానికి రోజంతా కావల్సిన ఎనర్జీని ప్రసాదిస్తుంది. ముఖ్యంగా సిట్రస్ ఫ్రూట్స్‌ను బ్రేక్‌ఫాస్ట్ రూపంలో అంటే పరగడుపున తినకూడదు.