Diabetes Tips: బ్లడ్ షుగర్‌కు మరో రూపమే గ్లూకోజ్. మనిషి శరీరానికి శక్తిని అందించేది ఇదే. మనం తినే ఆహారం ద్వారా ఇది సమకూరుతుంది. గ్లూకోజ్ శరీరంలోని అన్ని భాగాలకు చేరుతుంది. దాంతో ఎనర్జీ కలుగుతుంది. ఈ గ్లూకోజ్ శరీరంలో అధికమైతే హైపర్ గ్లైసీమియా అంటారు.
Diabetes Tips: హైపర్ గ్లైసీమియాకు చాలా కారణాలుంటాయి. టైప్ 1, టైప్ 2 డయాబెటిస్, గర్భధారణ సమయంలో డయాబెటిస్, మందులు కారణంగా రావచ్చు. మధుమేహాన్ని శాశ్వతంగా నియంత్రించగలిగే ఐదు అద్భుతమైన పదార్ధాల గురించి తెలుసుకుందాం.
తృణధాన్యాలు తృణ ధాన్యాల్లో ఫైబర్ వంటి పోషకాలు పెద్దమొత్తంలో ఉండటం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎప్పటికీ నియంత్రణలో ఉంటాయి.
నీరు నీరు శరీరానికి చాలా చాలా అవసరం. బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను నియంత్రణలో ఉంచడంలో నీళ్ల పాత్ర కూడా కీలకం. గ్లూకోజ్ ఎనర్జీగా మారడంలో నీళ్లు తోడ్పడతాయి. మలబద్ధకం సమస్యకు కూడా ఇదే పరిష్కారం.
లో ఫ్యాట్ ప్రోటీన్ ఫుడ్ లో ఫ్యాట్ ప్రోటీన్ ఫుడ్ చాలా అవసరం. దీనికోసం చికెన్, చేపలు, బీన్స్, మంచివి. ఇవి డైట్‌లో ఉంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. ఈ ప్రోటీన్స్ శరీరంలోని గ్లూకోజ్‌ను శక్తిగా మారుస్తాయి.
పండ్లు-కూరగాయలు పండ్లు కూరగాయల్లో ఫైబర్, విటమిన్లు చాలా ఎక్కువ మోతాదులో లభిస్తాయి. ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను నియంత్రిస్తాయి. ఫైబర్ గ్లూకోజ్ అవశోషణను నెమ్మదిస్తుంది. దాంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ ఒకేసారి పెరగడం అనేది ఉండదు. విటమిన్లు కూడా శరీరంలోని బ్లడ్ షుగర్ స్థాయిని తగ్గిస్తాయి.
డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్‌లో హెల్తీ ఫ్యాట్స్, ఫైబర్, విటమిన్లు చాలా ఎక్కువ ఉంటాయి. బ్లడ్ షుగర్ స్థాయిని నియంత్రించేందుకు డ్రై ఫ్రూట్స్ అద్భుతంగా ఉపయోగపడతాయి.