Breast Cancer: బ్రెస్ట్ కేన్సర్ ముప్పును పెంచే 5 ప్రధాన కారణాలివే, ఎలా గుర్తించాలి

Breast Cancer: ఇటీవలి కాలంలో బ్రెస్ట్ కేన్సర్ కేసులు పెరుగుతున్నాయి. మహిళల స్తనంలో వికసించే ఈ వ్యాధి అప్పుడప్పుడూ పురుషుల్లో కూడా వస్తుంటుంది. అమెరికలో జరిపిన ఓ అధ్యయనంలో 100 మంది బ్రెస్ట్ కేన్సర్ రోగుల్లో ఒకరు పురుషుడు అయి ఉంటున్నాడు. 

Breast Cancer: ప్రాణాంతకమైన కేన్సర్‌లలో బ్రెస్ట్ కేన్సర్ ఒకటి. స్తనంలో కణాలు అసాధారణంగా పెరుగుతుంటే బ్రెస్ట్ కేన్సర్ సోకవచ్చు. ఈ కణాలు అసాధారణంగా విభజితమౌతుంటాయి. అలా ఒక టిష్యూ ఏర్పడుతుంది. దీనినే ట్యూమర్‌గా పిలుస్తారు. బ్రెస్ట్ కేన్సర్ ముప్పుని పెంచే 5 ప్రధాన కారణాలు ఇవే..

1 /5

లైఫ్‌స్టైల్ కారణం లైఫ్‌స్టైల్ కూడా బ్రెస్ట్ కేన్సర్‌కు కారణం కావచ్చు. మద్యం నిత్యం తాగేవారిలో, ధూమపానం సేవించవారిలో బ్రెస్ట్ కేన్సర్ ముప్పు పెరుగుతుంది. 

2 /5

కుటుంబ నేపధ్యం కుటుంబంలో ఎవరైనా దగ్గరి బంధువులు, తల్లి, సోదరి, కుమార్తెకు బ్రెస్ట్ కేన్సర్ ఉంటే మీకు ముప్పు ఉన్నట్టే.

3 /5

వయస్సు రొమ్ము కేన్సర్ ముప్పు అనేది సాధారణంగా వయస్సుతోపాటు పెరుగుతుంది. ఎక్కువగా 50 ఏళ్లు దాటాక ఈ సమస్య రావచ్చు.

4 /5

జెనెటిక్ ఉత్పరివర్తనం ఏ మహిళల్లో అయితే బీఆర్సీఏ 1, బీఆర్సీయే 2 వంటి జీన్ ఉత్పరివర్తనాలు వారసత్వంగా లభిస్తాయో, వారిలో స్థనం, ఇతర కేన్సర్ ముప్పు అధికంగా ఉంటుంది. 

5 /5

హార్మోనల్ మార్పులు హార్మోనల్ మార్పులు కూడా బ్రెస్ట్ కేన్సర్ వ్యాధికి కారణం కావచ్చు. ఈస్ట్రోజన్ హార్మోన్ దీర్ఖకాలం పాటు బ్రెస్ట్ హార్మోన్ వికాసం, పనితీరులో కీలకపాత్ర పోషిస్తుంది. దీర్ఘకాలంలో ఇది కేన్సర్ ముప్పును పెంచుతుంది.