Health Tips: ఈ పద్ధతులు పాటిస్తే ఆర్ధరైటిస్ సమస్యకు చిటికెలో పరిష్కారం

Health Tips: ఇటీవలి కాలంలో అర్థరైటిస్ సమస్య చాలా ఎక్కువగా కన్పిస్తోంది. జీవనశైలి, పని ఒత్తిడి ఇలా వివిధ అంశాలు కారణాలుగా ఉన్నాయి. ఆర్ధరైటిస్ అనేది చాలా పెయిన్‌ఫుల్ సమస్య అనే చెప్పాలి. ఈ సమస్య నుంచి ఎప్పుడు ఎలా విముక్తి పొందాలో తెలుసుకుందాం..

Health Tips: కొన్ని టిప్స్ పాటిస్తే ఆర్థరైటిస్ వంటి ప్రమాదకరమైన సమస్యను కూడా సులభంగా పరిష్కరించుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆర్ధరైటిస్ నొప్పిని తగ్గించేందుకు కొన్ని పద్ధతులున్నాయి. ఆర్ధరైటిస్ నొప్పి నుంచి ఉపశమనం కల్గిస్తాయి. ఆ చిట్కాలు ఏంటనేది తెలుసుకుందాం..

1 /5

బరువు తగ్గడం ఆర్ధరైటిస్ నొప్పుల్ని తగ్గించాలంటే శరీర బరువు తగ్గించాల్సి ఉంటుంది. అదనంగా ఉన్న బరువు కచ్చితంగా జాయింట్స్‌పై ప్రభావం చూపిస్తుంది. ఒత్తిడి కల్గిస్తుంది. దాంతో ప్రశాంతత ఉండదు. హెల్తీ ఫుడ్, తగిన వ్యాయామం వంటి పద్ధతుల ద్వారా బరువు తగ్గించుకోవచ్చు.

2 /5

మెడిసిన్స్ వైద్యుడిని సంప్రదించి ఆర్ధరైటిస్‌కు తగిన మందులు తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఆర్ధరైటిస్ సమస్యకు ఇప్పుడు మందులు పూర్తిగా అందుబాటులో ఉన్నాయి.

3 /5

వ్యాయామం నిర్ణీత పద్దతిలో రోజూ తగిన రీతిలో వ్యాయామం చేయడం ద్వారా ఆర్ధరైటిస్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. జాయింట్ పెయిన్స్ తగ్గించడమే కాకుండా కండరాలను పటిష్టం చేస్తుంది. ఆర్ధరైటిస్ సమస్య తగ్గుతుంది.

4 /5

హాట్ అండ్ కోల్డ్ థెరపీ హీటింగ్ ప్యాడ్ లేదా వేడి కాపరంతో మజిల్స్ రిలాక్స్ అవుతాయి. జాయింట్స్ పట్టేయడం తగ్గుతుంది. దీనికోసం కోల్డ్ ప్యాక్ ధెరపీ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. 

5 /5

మానసిక శారీరక ప్రక్రియ ధ్యానం లేదా యోగా, దీర్ఘంగా శ్వాస పీల్చి వదిలే ప్రక్రియ, మానసిక, శారీరక ప్రక్రియల ద్వారా ఆర్ధరైటిస్ నొప్పుల్ని తగ్గించుకోవచ్చు.