Best Fruits: పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ప్రకృతిలో విరివిగా లభించే పండ్లలో శరీరానికి కావల్సిన ఎన్నో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. మీ డైట్ లో కేవలం ఈ ఐదు పండ్లు చేర్చితే ఇవాళే 5 వ్యాధుల్ని దూరం చేయవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణలుు
Best Fruits: పండ్లు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరకం. కొన్ని పండ్లను అదే పనిగా తీసుకోవడం వల్ల చాలా రకాల వ్యాధలకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా ఐదు రకాల పండ్లతో 5 రకాల వ్యాధుల్ని దరిచేరకుండా నియంత్రించవచ్చు. పూర్తి వివరాలు మీ కోసం..
ఆరటి పండ్లు మీకు తరచూ మూడ్ స్వింగ్ అవుతుంటే..కోపం విసుగు వెంటాడుతుంటే అరటి పండ్లు తింటే చాలావరకూ తగ్గుతుంది. మలబద్ధకాన్ని దూరం చేస్తుంది.
ఆరెంజ్ ఆరెంజ్ అనేది శరీరానికి ఇన్‌స్టంట్ ఎనర్జీ అందిస్తుంది. ఆరెంజ్ జ్యూస్ రూపంలో తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. దీనివల్ల ఇమ్యూనిటీ పటిష్టంగాపెరుగుతుంది. అంతేకాకుండా సీజనల్ వ్యాధుల్నించి రక్షించుకోవచ్చు. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
కివి కివిలో సైతం విటమిన్ సి అద్భుతమైన మోతాదులో ఉంటుంది. దీనివల్ల ఆస్తమా వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చు. వారంలో 4-5 కివీలు తింటే మంచి ఫలితాలుంటాయి.
ద్రాక్ష మీ శరీరంలో రక్తం తక్కువగా ఉంటే రోజూ ద్రాక్ష తింటే చాలా మంచి ఫలితాలుంటాయి. రక్తం లోటును ద్రాక్ష సమూలంగా తీర్చేస్తాయి. అదే సమయంలో రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది.
ఆపిల్ పండ్లలో ఆపిల్ ప్రత్యేకతే వేరు. ఆపిల్ ఎ డే కీప్ డాక్టర్ ఎవే అంటారు. ఆపిల్ అనేది పరిపూర్ణమైన పౌష్ఠికాహారం కలిగినది. డయాబెటిస్ రోగులు కూడా తినవచ్చు. ఆపిల్ తినడం వల్ల కొలెస్ట్రాల్, ఆస్తమా సమస్యలు దూరమౌతాయి.