World Liver Day: ప్రతి యేటా ఏప్రిల్ 19 ప్రపంచ లివర్ దినోత్సవం. వరల్డ్ లివర్ డే జరుపుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా లివర్ ప్రాముఖ్యత, ఆరోగ్యంపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. లివర్ ఆరోగ్యంగా ఉంచేందుకు ఏం చేయాలి, యోగాసనాలు ఏ విధంగా ఉపయోగపడతాయనేది తెలుసుకుందాం.
బాలాసనం ఈ ఆసనం ఒత్తిడిని తగ్గిస్తుంది. జీర్ణక్రియను ప్రశాంతపరుస్తుంది. లివర్‌పై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది.
ధనురాసనం ఈ ఆసనం కడుపు కండరాలను లాగి పెడుతుంది. జీర్ణక్రియను ఉత్తేజితం చేస్తుంది. లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది.
శలభాసనం ఈ ఆసనం కడుపు కండరాలను బలోపేతం చేస్తుంది. ఇది రక్త సరఫరాను మరింత మెరుగుపరుస్తుంది. లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది.
నౌకాసనం ఈ ఆసనం కడుపు, వీపు కండరాలను పటిష్టం చేస్తుంది. జీర్ణక్రియను మరింత ఉత్తేజితం చేస్తుంది. లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది.
భుజంగాసనం ఈ ఆసనం కడుపు కండరాలను పటిష్టం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. లివర్‌పై ఒత్తిడి తగ్గిస్తుంది.