Diabetes-Yoga: రోజూ ఈ నాలుగు యోగాసనాలు వేస్తే మధుమేహం ఇట్టే మాయం

మధుమేహ వ్యాధిగ్రస్థులు డైట్ విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా పండుగల వేళ మరింత కేర్ అవసరం. హోలీ పండుగ సందర్భంగా పెద్దఎత్తున స్వీట్స్ తిని బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోయే ప్రమాదం ఉంది. అయితే కొన్ని యోగాసనాలను క్రమం తప్పకుండా ఆచరించడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో రావచ్చు. ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందాం.

Diabetes-Yoga: మధుమేహ వ్యాధిగ్రస్థులు డైట్ విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా పండుగల వేళ మరింత కేర్ అవసరం. హోలీ పండుగ సందర్భంగా పెద్దఎత్తున స్వీట్స్ తిని బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోయే ప్రమాదం ఉంది. అయితే కొన్ని యోగాసనాలను క్రమం తప్పకుండా ఆచరించడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో రావచ్చు. ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందాం.

1 /4

త్రికోణాసనం ఈ ఆసనం ఒత్తిడిని అధిగమించేలా చేస్తుంది. శరీరాన్ని బ్యాలెన్స్‌గా ఉంచుతుంది. ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.

2 /4

పశ్చిమోత్తాసనం పశ్చిమోత్తాసనం కూడా కడుపు సంబంధిత అంగాలు, కండరాలను ఉత్తేజితం చేస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఎప్పుడైతే జీర్ణక్రియ మెరుగుపడిందో చక్కెర సంగ్రహణ తగ్గుతుంది. దాంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.

3 /4

భుజంగాసనం భుజంగాసనం అనేది కడుపులోని కండరాల్ని ఉత్తేజితం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దాంతో రక్తంలో చక్కెర శాతం అదుపులో ఉంటుంది. అంతేకాకుండా వెన్నెముక కూడా పటిష్టం అవుతుంది. 

4 /4

బాలాసనం బాలాసనంతో ఒత్తిడిని జయించవచ్చు. ఇది శరీరాన్ని శాంతపరుస్తుంది. బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్ రెండూ నియంత్రణలో ఉంటాయి.