Amla Side Effects: ఉసిరి శరీరానికి చాలా ప్రయోజనకరం. చాలా అనారోగ్య సమస్యలకు ఇది దివ్యౌషధంలా పనిచేస్తుంది. అందుకే ఉసిరిని డైట్‌లో చేర్చడం తప్పనిసరి. ఇందులో పుష్కలంగా లభించే విటమిన్ సి చాలా దోహదపడుతుంది. అయితే కొంతమంది మాత్రం ఉసిరి తీసుకోకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
యూరిన్ ఇన్‌ఫెక్షన్ చాలామందికి యూరిన్ ఇన్‌ఫెక్షన్ సమస్యగా ఉంటుంది. లేకపోతే యూరిన్‌లో మంట ఉత్పన్నమౌతుంది.
మలబద్ధకం మలబద్ధకం రోగులు ఉసిరికి దూరంగా ఉండటం మంచిది. పరిమితి మించి తినడం వల్ల మలబద్ధకం సమస్య తలెత్తుతుంది. మల బద్ధకం సమస్య మరింతగా పెరిగిపోతుంది.
నీటి కొరత శరీరంలో నీటి కొరత ఉన్నప్పుడు కూడా ఉసిరి తినడం హానికారకం కావచ్చు. శరీరంలో డైనెస్ సమస్య తలెత్తతుంది.
ఎసిడిటీ కొంతమందికి ఎదైనా తింటే ఎసిడిటీ సమస్య ఉత్పన్నమౌతుంటుంది. ఈ సమస్య ఉండేవాళ్లు పొరపాటున కూడా ఉసిరి తినకూడదు.
గుండె రోగులకు... ఉసిరి తినడం వల్ల కేశాల ఎదుగుదలతో పాటు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. కానీ ఉసిరి గుండె రోగులకు మంచిది కాదు. హాని కారకం కావచ్చు.