Happy Bhogi Wishes 2024: భోగి పండగ శుభాకాంక్షలు, ప్రత్యేకమైన కోట్స్, వాట్సప్ స్టేటస్ పిక్స్‌, గ్రీటింగ్స్..


Happy Bhogi 2024 Wishes In Telugu: ఈ సంవత్సరం భోగి పండుగ జనవరి 14వ తేదీన వచ్చింది. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ పండగను ప్రతి ఒక్కరు ఘనంగా జరుపుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేయాలి. మేము అందించే ఈ కోట్స్, ప్రత్యేక ఫోటోస్‌తో మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేయండి.

Happy Bhogi 2024 Wishes In Telugu: ప్రతి సంవత్సరం భారతీయులు భోగి పండగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండగను సంక్రాంతికి ఒకరోజు ముందు జరుపుకోవాలని పూర్వీకుల నుంచి ఆనవాయితీగా వస్తోంది.  భోగి పండగకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పండగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం భోగి పండగ జనవరి 14వ తేదీన వచ్చింది. పూర్వీకుల నుంచి ఈ పండగ రోజు ఇంట్లో ఉండే పాత సామాన్లను భోగి మంటల్లో వేయడం ఓ సాంప్రదాయంగా వస్తోంది. అంతేకాకుండా ఈరోజు అందరూ కొత్త వస్త్రాలను ధరించి.. సూర్యభగవానుడిని పూజిస్తారు. ఇలాంటి ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండగ అందరి జీవితాల్లో సంతోషాన్ని అదృష్టాన్ని అందజేయాలని కోరుకుంటూ ప్రత్యేక శుభాకాంక్షలు మీ తోటి మిత్రులకు కుటుంబ సభ్యులకు సోషల్ మీడియా ద్వారా పంపండి. 

1 /7

భోగి మంటలు మీ జీవితంలోని కష్టాలన్నీ దహించి వేయాలని మనసారా కోరుకుంటూ..మీకు మీ కుటుంబ సభ్యులందరికీ..భోగి పండుగ శుభాకాంక్షలు..  

2 /7

మీలో ఉన్న ప్రతికూల ఆలోచనలను భోగిమంటల్లో వేసి.. సానుకూల ఆలోచనలను భోగి పండుగ రోజు స్వాగతించండి..Happy Bhogi.  

3 /7

ఆకాశంలోని ఎగిరే పతంగుల్లా.. ఎప్పుడు మీరు అన్నింటిలో పైకి ఎదగాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ .. హ్యాపీ భోగి..  

4 /7

భోగి పండుగ రోజున భోగి మంటలు మీ సమస్యలన్నీ దహించి వేయాలని ఆకాంక్షిస్తూ.. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి పండుగ ప్రత్యేక శుభాకాంక్షలు.  

5 /7

మీ జీవితంలోని కష్టాలు, దుఃఖాలు, బాధలు భోగిమంటల్లో కలిసిపోవాలని కోరుకుంటూ.. ప్రతి ఒక్కరికి పేరుపేరునా భోగి పండుగ శుభాకాంక్షలు.  

6 /7

ఎంతో ప్రాముఖ్యమైన ఈ భోగి పండగ రోజున కొత్త జీవితానికి సుభారంభం కావాలని ఆ సూర్య భగవానుడిని ప్రార్థిస్తూ మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ Happy Bhogi..  

7 /7

గతంలోని సమస్యలన్నీ వదిలేస్తూ ఈ భోగి పండుగ రోజు నుంచి మరో కొత్త జీవితాన్ని స్వాగతించాలని ఆకాంక్షిస్తూ..మీ అందరికీ భోగి పండుగ ప్రత్యేక శుభాకాంక్షలు..