Green Tea Tips in Telugu: ఇటీవలి కాలంలో గ్రీన్ టీ ప్రాముఖ్యత పెరుగుతోంది. బరువు తగ్గించేందుకు గ్రీన్ టీ అద్భుతంగా పనిచేస్తుంది. గ్రీన్ టీ లో ఉండే పోషకాల కారణంగా ఆరోగ్యపరంగా ఇది చాలా మంచిది. శరీరంలో మెటబోలిజంను వేగవంతం చేస్తుంది. ఫలితంగా కొవ్వు వేగంగా బర్న్ అవుతుంది. అయితే చాలామంది గ్రీన్ టీ విషయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. మీరు కూడా ఈ తప్పులు చేస్తుంటే ప్రయోజనాలకంటే నష్టాలే అధికంగా ఉంటాయి.
రెండోసారి గ్రీన్ టీ బ్యాగ్ ఉపయోగించకూడదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ టీ బ్యాగ్ మాత్రమే ఉపయోగించాలి.
గ్రీన్ టీ కొన్ని మందులతో రియాక్షన్ ఇస్తుంది. రక్తం పల్చగా చేసే మందులు, డిప్రెషన్, హై బీపీ మందులు ముఖ్యమైనవి. ఈ మందులు తీసుకునేవాళ్లు గ్రీన్ టీ తాగాలంటే వైద్యుని సంప్రదించాలి.
ఉడుకుతున్న నీళ్లలో గ్రీన్ టీ కలపడం వల్ల అందులోని పోషకాలు నష్టపోతాయి. దాంతో రుచి చేదుగా మారుతుంది. గ్రీన్ టీను 80-85 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత దాటకుండా చూడాలి
భోజనం చేసిన వెంటనే గ్రీన్ టీ తాగితే ఐరన్ సంగ్రహణలో సమస్య ఏర్పడుతుంది. దాంతో ఐరన్ లోపం ఏర్పడుతుంది. అందుకే భోజనానికి గ్రీన్ టీ తాగడానికి మధ్య కనీసం 1 గంట విరామం ఉండాలి
గ్రీన్ టీలో ఉండే కెఫీన్ కారణంగా నిద్రపోవడానికి కొద్దిసేపు ముందు తాగితే మొత్తం నిద్ర చెడిపోతుంది. అందుకే గ్రీన్ టీ తాగాలంటే ఎప్పుడూ నిద్రపోవడానికి 2-3 గంటల ముందు సేవించాలి
గ్రీన్ టీతో ప్రయోజనాలు చాలా ఉన్నాయి కానీ మోతాదు మించి తాగకూడదు. పరిమితి దాటి తాగితే నిద్రలేమి, ఆందోళన, జీర్ణ సంబంధ సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. రోజూకు 2-3 కప్పుల గ్రీన్ టీ వరకు తాగవచ్చు. అంతకు మించకూడదు. 2 తాగితే మరీ మంచిది.
గ్రీన్ టీలో ఉండే ట్యానిన్ కారణంగా కడుపులో ఎసిడిటీ పెరగవచ్చు. ఫలితంగా కడుపు సంబంధిత సమస్యలు దూరమౌతాయి. జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతాయి. అందుకే గ్రీన్ టీ తాగేముందు నిపుణుల సూచనలు తీసుకోవాలి.