India Vs Pakistan Test Match: క్రికెట్ అభిమానులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. పాక్‌తో టీమిండియా టెస్ట్ సిరీస్..!

Ind Vs Pak Test Series: భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్‌ ఎక్కడ జరిగినా.. ఏ ఫార్మాట్‌లో జరిగినా.. క్రీడా అభిమానులకు అది ఒక ఎమోషన్. ఇక క్రికెట్‌లో అయితే ఈ ఎమోషన్స్ తారాస్థాయిలో ఉంటాయి. ప్రస్తుతం కేవలం ఐసీసీ టోర్నీల్లోనే భారత్-పాక్ తలపడుతుండగా.. ద్వైపాక్షిక సిరీస్‌లు మాత్రం జరగడం లేదు. అభిమానులు కూడా దాయాదుల మధ్య ముఖాముఖి సిరీస్‌ పోరు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ గుడ్‌న్యూస్ తెరపైకి వచ్చింది.
 

1 /6

పాకిస్థాన్ జట్టు భారత్‌లో చివరిసారిగా 2012లో పర్యటించింది. ఆ తర్వాత రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగలేదు.   

2 /6

ఇంగ్లాండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ రిచర్డ్‌ గౌల్డ్‌ భారత్‌-పాకిస్థాన్‌ మధ్య టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు తాము సిద్ధమని వెల్లడించారు.   

3 /6

ఇంగ్లాండ్‌లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్‌ను నిర్వహించాలని ఆయన తన కోరికను వ్యక్తం చేశారు. ఈ సిరీస్‌కు పాకిస్థాన్ సిద్ధంగా ఉన్నా.. బీసీసీఐ మాత్రం అంగీకరించకపోవచ్చు.  

4 /6

పాకిస్థాన్ వేదిక జరిగే ఐసీసీ టోర్నీల్లోనూ భారత్ పాల్గొనడం లేదు. గతేడాది ఆసియా కప్ పాక్ వేదికగా జరిగినా.. భారత్ మాత్రం తన మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడింది.  

5 /6

వచ్చే పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనున్న ఛాంపియన్ ట్రోఫీపై బీసీసీఐ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. పాక్‌లో కాకుండా శ్రీలంక లేదా దుబాయ్ వేదికగా తమ మ్యాచ్‌లు నిర్వహించాలని కోరుతోంది.  

6 /6

తాజాగా ఇంగ్లాండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ రిచర్డ్‌ గౌల్డ్‌ కామెంట్స్‌తో అభిమానుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. 17 ఏళ్ల క్రితం 2007లో భారత్, పాకిస్థాన్ మధ్య చివరి టెస్టు మ్యాచ్ జరిగింది. ఆ తర్వాత టెస్టు సిరీస్‌ ఆడలేదు. ఇప్పటికైనా బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుందో లేదో చూడాలి మరి.   

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x