AP Free Bus: మహిళలకు బంపర్‌ ఆఫర్.. ఉచిత బస్సు సౌకర్యం ఆరోజు నుంచే ప్రారంభం..!

AP Free Bus Sheme From August 15th: ఇదిలా ఉండగా ఏపీ వ్యాప్తంగా ఉచిత బస్సు పథకం కానుండగా తిరుమల వంటి జనసందోహం అధికంగా ఉండే ప్రాంతాలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తారా? లేదా? అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

1 /5

AP Free Bus Sheme From August 15th: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తోంది. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం వస్తే మహిళలకు వెంటనే ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలో మహిళలకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది ఏపీ ప్రభుత్వం.  

2 /5

ఈ సందర్భంగా మహిళలకు ఆ తీపి కబురు చెప్పింది కూటమి ప్రభుత్వం. మహిళలకు ఫ్రీ బస్సు పథకాన్ని ఆగస్టు 15 నుంచి ప్రారంభించనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్‌ ఎక్స్‌ వేదికగా షేర్‌ చేశారు. ఇప్పటికే తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సును ప్రారంభించారు. వచ్చే నెల నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని మొదలు పెట్టనున్నారు.  

3 /5

ఈ మధ్యకాలంలోనే పెంచిన పెన్షన్లు, ఇచిత ఇసుక, తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు మహిళలకు పెద్దపీట వేస్తూ వారికి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించడానికి పూర్తి సన్నహాలు చేస్తోంది. ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం ఏ విధంగా అమలు అవుతుందో అంచనా వేశారు.  

4 /5

ఇదిలా ఉండగా ఏపీ వ్యాప్తంగా ఉచిత బస్సు పథకం కానుండగా తిరుమల వంటి జనసందోహం అధికంగా ఉండే ప్రాంతాలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తారా? లేదా? అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. జీరో టిక్కెట్‌ విధానంపై క్షుణ్నంగా పరిశీలించిన ఏపీ ప్రభుత్వం వచ్చే నెల ఏపీలో కూడా అమలు చేయనుంది.  

5 /5

ఏపీ వ్యాప్తంగా అమలు కానున్న ఉచిత బస్సు సౌకర్యానికి ప్రభుత్వంపై ఎంత మేర భారం పడుతుందో కూడా అంచనా వేయాల్సి ఉంది. ఈ సందర్భంగా ఉచిత బస్సు ప్రయాణం ప్రజా సంక్షేమంలో భాగంగా అమలు చేయనున్నట్లు మంత్రి అనగాని ట్విట్టర్‌ వేదికగా షేర్‌ చేశారు.