AP TET 2024:టెట్‌ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. ఒకే ప్రాంతంలో ఎగ్జామ్‌ సెంటర్‌, సందేహాలు ఉంటే సంప్రదించాల్సిన నంబర్లివే..

AP TET 2024 Examination: ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (TET)కు ప్రిపెయిర్‌ అయ్యే అభ్యర్థులకు విద్యాశాఖ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. టెలట్‌ అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

ఇటీవలె టెట్‌కు సంబంధించిన హాల్‌ టిక్కెట్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఏపీ టెట్‌ ఎగ్జామ్‌  అక్టోబర్‌ 3 నుంచి 21 వరకు వివిధ సెషన్లలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ పరీక్షకు సంబంధించిన బిగ్‌ అప్డేట్‌ను షేర్‌ చేసింది ఏపీ విద్యాశాఖ.   

2 /5

ఇప్పటి వరకు టెట్‌ పరీక్షకు హాజరయ్యే కొందరు టెట్‌ అభ్యర్థులకు రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఎగ్జామ్‌ సెంటర్లు కేటాయించేది. అయితే, ఇలా వేర్వేరు సెంటర్లలలో పరీక్ష రాయడానికి పడుతున్న అభ్యర్థుల ఇబ్బందుల నేపథ్యంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు.  

3 /5

ఇకపై టెట్‌ అభ్యర్థులు రాసే ఎగ్జామ్‌  ఒకే ప్రాంతంలో ఎగ్జామ్‌ సెంటర్‌ కేటాయిస్తూ ఆన్‌లైన్‌లో హాల్‌ టిక్కెట్లను పొందుపర్చారు.  అభ్యర్థులు గందరగోళానికి గురికాకుండా ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.  

4 /5

టెట్‌కు రాస్తున్న అభ్యర్థులు సందేహాల నివృత్తికి ఫోన నంబర్లు కూడా అధికారులు అందుబాటులో ఉంచారు. ఏమైనా సందేహాలు ఉంటే 9398810958, 6281704160, 8121947387, 8125046997, 7995649286, 7995649286, 9963069286, 9398822618 ఫోన్‌ నంబర్లకు సంప్రదించాలి. ఈమెయిల్‌ grievenes.tet@apschool.in మెయిల్‌ చేయవచ్చు.  

5 /5

టెట్‌కు హాజరయ్యే అభ్యర్థులకు అధికారిక వెబ్‌సైట్‌ aptet.apcfss.in ద్వారా నేరుగా హాల్‌ టిక్కెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. టెట్‌ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ ఏడాది 4,27,300. టెట్‌ విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులు డీఎస్సీ ఎగ్జామ్‌కు అర్హత సాధిస్తారు.