Gold and Silver Rates Today: ప్రతిరోజు రికార్డుల మోత మోగిస్తున్న బంగారం ధర నేడు స్వల్పంగా తగ్గింది. దీంతో పాటు వెండి కూడా కాస్త తగ్గుముఖం బాట పట్టింది. నేడు అక్టోబర్ 9వ తేదీ బుధవారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Today Gold Rate: బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. నేటి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,450గా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాములు బంగారం ధర రూ. 70,950గా ఉంది. బంగారం ధర నిన్నటితో పోల్చి చూసినట్లయితే సుమారు 200 రూపాయలు తగ్గింది.
బంగారం ధరలు గత వారం రోజులుగా భారీగా పెరుగుతూ వస్తున్నాయి. ఇదే వారంలో బంగారం ధర ఆల్ టైం రికార్డ్ స్థాయిని తాకింది. అయితే ఆల్ టైం రికార్డ్ స్థాయి నుంచి బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దీంతో బంగారం ధరలు భవిష్యత్తులో ఎలా ఉంటాయి? పెరుగుతాయా లేక తగ్గుతాయా అనే సందేహం పసిడి ప్రియుల్లో కలుగుతోంది. అటు వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. లక్షల రూపాయలు దాటిన వెండి ధర క్రమంగా తగ్గుతోంది.
బంగారం ధరలు పెరగడానికి తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయంగా నెలకొని ఉన్న పరిస్థితుల కారణం అవుతుంటాయి. ప్రస్తుతం పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొని ఉంది ఈ నేపథ్యంలో బంగారం ధరలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రధానంగా ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య నెలకొని ఉన్న యుద్ధ వాతావరణం కారణంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగే అవకాశం ఉంటుంది.
ఈ కారణంగా వాణిజ్యం కుంటుపడి స్టాక్ మార్కెట్లో నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఫలితంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సేఫస్ట్ హెవెన్ గా భావించే బంగారం వైపు తరలిస్తారు. ఈ కారణంగా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. దీనికి తోడు ప్రపంచ మార్కెట్ల నుంచి చైనా పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేస్తోంది. బంగారం ధరలు పెరగడానికి పరోక్షంగా ఇది కూడా ఒక కారణంగా చెప్పవచ్చు.
అలాగే అమెరికా అధ్యక్షుడు ఎన్నికలు కూడా బంగారం ధరలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అమెరికాలో ఎన్నికల సందర్భంలో స్టాక్ మార్కెట్లో ఊహిసలాటకు గురయ్యే అవకాశం ఉంటుంది. దీని ఆధారంగా చూసుకున్నట్లయితే బంగారం ధరలు భారీగా పెరగడానికి ఒక ఆస్కారం ఏర్పడుతుంది. బంగారం ధర ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ల పైన ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.
దీనికి తోడు దేశీయంగా కూడా బంగారం ధరలు పెరగడానికి ప్రస్తుతం ఫెస్టివల్ సీజన్ ఒక కారణంగా చెప్పవచ్చు. ఈ ఫెస్టివల్ సీజన్ సందర్భంగా బంగారం ధర ఇప్పటికే రికార్డు స్థాయి స్థాపించింది. అయితే బంగారం పై ఇన్వెస్ట్ చేసేవారు మాత్రం, ఆభరణాలపై కాకుండా ప్రభుత్వం జారీ చేసే సావరిన్ గోల్డ్ బాండ్ల పైన పెట్టుబడి పెట్టినట్లయితే మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉందని సూచిస్తున్నారు.